AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulichintala: పులిచింతల క్రస్ట్‌ గేటు స్థానంలో స్టాప్‌ లాగ్‌ ఏర్పాటు.. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

పులిచింతల ప్రాజెక్టులో ఊడిపోయిన 16వ గేటు స్థానంలో యుద్ధప్రాతిపదికన స్టాప్‌ లాగ్‌ గేటు అమర్చే పనులు వేగవంతం..

Pulichintala: పులిచింతల క్రస్ట్‌ గేటు స్థానంలో స్టాప్‌ లాగ్‌ ఏర్పాటు.. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
Pulichintala Praject
Balaraju Goud
|

Updated on: Aug 07, 2021 | 8:01 AM

Share

Pulichintala Project Crest Gate: పులిచింతల ప్రాజెక్టులో ఎడమ వైపున ట్రూనియన్‌ బీమ్‌ విరిగిపోవడం వల్ల ఊడిపోయిన 16వ గేటు స్థానంలో యుద్ధప్రాతిపదికన స్టాప్‌ లాగ్‌ గేటును అమర్చేందుకు జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్టాప్‌ లాగ్‌ గేటును దించేందుకు ముందస్తుగా చేపట్టాల్సిన పనులను ప్రాజెక్టు ఎస్‌ఈ రమేష్‌ పర్యవేక్షణలో బీకెమ్‌ సంస్థ నిపుణులు శుక్రవారం పూర్తి చేశారు. శనివారం ఉదయం ప్రాజెక్టులో నీటిమట్టం క్రస్ట్‌ లెవల్‌కు చేర్చే పనులు మొదలు పెట్టారు. కొన్ని గంటల వ్యవధిలో స్టాప్‌ లాగ్‌ గేటును దించుతామని నీటి పారుదల అధికారులు తెలిపారు.

ఈ గేటును 11 ఎలిమెంట్స్‌గా కిందికి దించి.. ఊడిపోయిన 16వ గేటు వెనుక భాగంలో పియర్స్‌కు అమర్చిన రెయిలింగ్‌ ద్వారా 17 మీటర్ల వెడల్పు, సుమారు 1.68 మీటర్ల పొడవు గల 28 టన్నుల ఎలిమెంట్‌ను తొలుత దించుతారు. దానిపై అంతే వెడల్పు, ఎత్తుతో కూడిన 26 టన్నుల బరువైన ఎలిమెంట్‌ దించుతారు. వాటికి ముందే అమర్చిన రబ్బర్‌ సీల్స్‌తో ఆ రెండు ఎలిమెంట్లను అతికిస్తారు. ఇలా 11 భాగాలను ఒక దానిపై ఒకటి దించి.. అతికించడం ద్వారా 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్‌ లాగ్‌ గేటును ఏర్పాటు చేస్తారు. కాగా, ఇప్పటివరకు 11 ఎలిమెంట్స్‌కు గానూ మూడు ఫ్రేమ్‌లు అమర్చారు నిపుణులు. కాగా, ఈ గేటు బరువు సుమారు 240 టన్నుల బరువు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి గేటు ఎత్తు, వెడల్పు స్థాయిలో ఈ స్టాప్‌ లాగ్‌ గేటును ఏర్పాటు చేయడం ద్వారా జలాశయంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి వీలువుతుందని అధికారులు వెల్లడించారు.

మరోవైపు, కృష్ణా నదికి వరద ఉధృతి పోటెత్తుతుండటంతో పులిచింతల ప్రాజెక్టు ఎగువనుండి లక్షా ఎనిమిది వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 18 గేట్లు ద్వారా దిగువకు మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతలలో ప్రస్తుతం నీటి నిల్వ ఐదు టియంసీలు అంటే 125.9 అడుగుల మేర ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 45 టియంసీలు (175 అడుగులు). మరోవైపు పులిచింతల వద్ద మరమత్తు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. మరోవైపు ఈనెల19వ తేదీ వరకు పూర్తిగా ఇరువైపుల రాకపోకలు నిషేధం విధిస్తున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, పులిచింతల 2003లో చంద్రబాబు హయాంలో పురుడు పోసుకుని.. 2005లో వైయస్ జమానాలో పనులు మొదలై.. 2012లో పూర్తయ్యి.. 2013లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు. అలాంటి పులిచింతలలో.. 32 రెండు గేట్లకుగానూ 24 గేట్లకు cwc నుంచి అనుమతులు పొంది ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసింది శ్రీనివాసా కన్ స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ బొల్లినేని రామారావు అనే టీడీపీ కాంట్రాక్టర్ కి చెందినది కావడం.. దానికి తోడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2015లో ఒక రిపోర్టు రావడం. ఇందులో కొన్ని లోపాలున్నాయని తెలియటం.. అయినా సరే 2019లో కాంట్రాక్టర్ కి మరో 200 కోట్ల రూపాయలు తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో డబ్బులు ఇవ్వడం జరిగిపోయింది. అలాంటి ప్రాజెక్టులోని 16వ గేటు ఇటీవల విరిగి పడింది.

Read Also… Muharram: ఈనెల 10 నుంచి మొహర్రం సంతాప దినాలు.. ముస్తాబవుతున్న ఆషుర్ ఖానాలు..19న బీబీ కా ఆలం ఊరేగింపు..