Nirmala Sitharaman: ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్థికమంత్రి పర్యటన.. పొందూరులో చేనేత వేడుకల్లో పాల్గోనబోతోన్న నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా పొందూరులో ఘనంగా నిర్వహించబోతోన్న చేనేత వేడుకల్లో..
National Handloom Day 2021: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా పొందూరులో ఘనంగా నిర్వహించబోతోన్న చేనేత వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గోనబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారమన్ నిన్న సాయంత్రమే విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఏపీ మంత్రులు, బీజేపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ కు వెళ్లారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శ్రీకాకుళం జిల్లా పొందూరు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పొందూరులో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న అనంతరం నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 3 గంటలకు జేవీఆర్ కన్వెన్షన్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సమావేశంపై ఈ మీటింగ్ కు సంబంధించి నాయకులతో చర్చించారు. అనుమతి పాస్‌లు ఉన్నవారికే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పర్యటనతో పొందూరు ఖాదీకి పూర్వ వైభవం రానుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పొందూరు ఖాదీని సందర్శించేందుకు ఇవాళ నిర్మలాసీతారామన్ వస్తున్నట్లు చెప్పారు. ఆమె రాకతో ఖాదీ కార్మికుల సమస్యలు పరిష్కారం కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీ నాయకులతో నిర్మలా సీతారామన్ నిర్వహించనున్న సమావేశానికి జరుగుతున్న ఏర్పాట్లను బీజేపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఉత్తరాంధ్రాలో పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారని బీజేపీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ గద్దే బాబూరావు తెలిపారు.
Read aslo: Kadapa Double Murders Story: కడప జిల్లా డి నేలటూరు డబుల్ మర్డర్స్ కేసులో విస్తుపోయే విషయాలు.!