Andhra Pradesh: నేడు సైకిల్ ఎక్కనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
వైసీపీ రెబల్ నేత, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి ఇవాళ (మార్చి 24) టీడీపీలో చేరనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నానని, తనకు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు.
వైసీపీ రెబల్ నేత, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి ఇవాళ (మార్చి 24) టీడీపీలో చేరనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నానని, తనకు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందరర్భంగా చంద్రబాబు , లోకేష్ ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు. నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించి.. ఆ తరువాత అమరావతికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటల తర్వాత చంద్రబాబు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైసీపీ నేత అయిన గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. అయితే ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంత కాలంగా వైసీసీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ ప్రభుత్వంతో పాటూ సొంత పార్టీపై ఆరోపణలు చేశారు.. అధికార పార్టీకి రెబల్‌గా మారారు.
ఈక్రమంలో గిరిధర్ రెడ్డి కూడా సోదరుడి బాటలోనే నడిచారు. దీంతో ఇటీవల గిరిధర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే శ్రీధర్ రెడ్డి కూడా వైసీసీని వీడి టీడపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..