AP MLC Election: ప్లాన్ వర్కువుట్.. దొరికిన బ్లాక్ షీప్స్.. కోడింగ్‌తో ఆ ఇద్దర్నీ పట్టేసిన వైసీపీ

ఎవరెవరు ఎవరికి ఓటు వేశారో వైసీపీ అధిష్టానం గుర్తించింది. నమ్మకద్రోహం చేసినవారిపై సరైన సమయంలో.. సరైన చర్యలు ఉంటాయని వైసీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఫైనల్‌గా ఇద్దరు బ్లాక్‌షీప్స్‌ని వైసీపీ గుర్తించింది. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.

AP MLC Election: ప్లాన్ వర్కువుట్.. దొరికిన బ్లాక్ షీప్స్..  కోడింగ్‌తో ఆ ఇద్దర్నీ పట్టేసిన వైసీపీ
Sajalla Rama Krishna Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2023 | 9:23 AM

కోడింగ్‌తో ఎమ్మెల్యేల వ్యవహారం బయటపడినట్టు క్లియర్‌గా తెలుస్తోంది. నిజానికి తమ ఎమ్మెల్యేల్లో ఎవరైనా టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తారేమోనని అనుమానించిన వైసీపీ అధిష్టానం.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రతీ ఎమ్మెల్యేకి విడివిడిగా ప్రత్యేక ఫార్మాట్‌ అందజేసింది. ఎమ్మెల్యేలు రెండు నుంచి ఏడు వరకు వేసే ప్రాధాన్యత ఓట్లలో రకరకాల కాంబినేషన్లు క్రియేట్ చేసి.. ఒక్కొక్కరికి ఒక్కో ఫార్మాట్‌ను కేటాయించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు బ్యాలెట్ పత్రాన్ని చూపించినప్పుడు.. ఎమ్మెల్యేలు తమ ప్రాధాన్యతా ఓట్లు ఏ ఫార్మాట్‌లో వేశారో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు నోట్ చేసుకోవాలని సూచించింది. తమ ఎమ్మెల్యేలు ఎవరైనా టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఫార్మాట్ ఆధారంగా కనిపెట్టాలన్నది వైసీపీ ఆలోచన. అక్కడే వాళ్ల ప్లాన్‌ వర్కవుట్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఓట్ల లెక్కింపులో భాగంగా.. పోటీలో ఉన్న 8మంది అభ్యర్థుల కోసం అధికారులు 8 ట్రేలు ఏర్పాటు చేశారు. ప్రతీ బ్యాలెట్ పత్రాన్ని వైసీపీ, టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు చూపించారు. మొదటి ప్రాధాన్యతా ఓటు వచ్చిన అభ్యర్థికి సంబంధించిన ట్రేలో ఆ బ్యాలెట్ పత్రాన్ని వేశారు. అలా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు వచ్చిన ఓట్లను ఆమెకు కేటాయించిన ట్రేలో 23 బ్యాలెట్ పత్రాలు వేశారు. ఆ బ్యాలెట్ పేపర్లన్నీ సక్రమంగానే ఉన్నాయని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు కన్‌ఫామ్‌ చేశాకే అనురాధకు కేటాయించిన ట్రేలో వేశారు అధికారులు.

మొదటిసారి బ్యాలెట్ పత్రాన్ని చూపించినప్పుడే.. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు వాటిలో ప్రాధాన్యతా ఓట్లను ఏ క్రమంలో వేశారో నోట్ చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు రావడం.. ఆమె గెలిచారని తెలిశాక.. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు 23 బ్యాలెట్ పత్రాల రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే ఓ ఉన్నతాధికారి అనురాధకు పడ్డ ఓట్లను మరోసారి కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించారు. దీంతో ఎవరెవరు ఎవరికి ఓటు వేశారో కోడింగ్‌తో కన్‌ఫామ్ చేసుకున్నారు వైసీపీ ఏజెంట్లు. మొదటి ప్రాధాన్యత ఓటు టీడీపీకి వేసిన ఓ మహిళా ఎమ్మెల్యే.. మిగిలినవి మార్చలేదని గుర్తించారు. అలాగే కోడింగ్ మార్పుతో నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేను ఐడెంటిపై చేశారు. మొత్తానికి కోడింగ్‌తో ఢీ కోడ్ చేసి ఎవరు ఎటువైపు ఓటు వేశారో గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..