AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koneru Humpy: కోనేరు హంపి అరుదైన ఘనత.. తొలి మహిళగా భారీ రికార్డ్..

FIDE Women’s World Cup: క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మొదటి గేమ్‌లో తెల్లపావులతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజయం సాధించిన హంపి, రెండో గేమ్‌లో డ్రా చేసుకుని సెమీస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

Koneru Humpy: కోనేరు హంపి అరుదైన ఘనత.. తొలి మహిళగా భారీ రికార్డ్..
Koneru Humpy
Venkata Chari
|

Updated on: Jul 21, 2025 | 4:32 PM

Share

Koneru Humpy: భారత చెస్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖితమైంది. తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. జార్జియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆమె తన అద్భుతమైన వ్యూహాలు, పట్టుదలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది.

చారిత్రక విజయం..

క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మొదటి గేమ్‌లో తెల్లపావులతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజయం సాధించిన హంపి, రెండో గేమ్‌లో డ్రా చేసుకుని సెమీస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆమె ప్రతి కదలికలో కనిపించిన అనుభవం, వ్యూహాత్మక ఆలోచన విజయానికి కారణమైంది.

ప్రశంసల వెల్లువ..

కోనేరు హంపి ఈ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలామంది ప్రముఖులు హంపికి శుభాకాంక్షలు తెలియజేశారు. “వరల్డ్ కప్ సెమీఫైనల్లో చేరిన తొలి భారతీయ మహిళగా కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయగా, చంద్రబాబు నాయుడు “మన తెలుగు కుమార్తె ప్రపంచ వేదికపై కాంతులు విరజిమ్ముతోంది. నీ ఘనత దేశవ్యాప్తంగా మమ్మల్ని గర్వించేలా చేస్తోంది” అని కొనియాడారు.

హంపి ప్రస్థానం..

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో 1987లో జన్మించిన కోనేరు హంపి ఐదు సంవత్సరాల వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా చదరంగం ఆటను నేర్చుకుంది. 2002లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఆమె, 2019, 2024లో మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. అనేక అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకున్న హంపి, భారత మహిళా చెస్‌కు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు సెమీఫైనల్లో ఆమె విజయంపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..