Undavalli Sridevi ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై కోనసీమ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్..

Undavalli Sridevi ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై కోనసీమ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
Amalapuram

MLA Vundavalli Sridevi: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంబెడ్కర్ పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధాన రహదారులపై దళిత సంఘాలు ఆందోళన..

Surya Kala

|

Dec 31, 2021 | 4:04 PM

MLA Vundavalli Sridevi: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంబెడ్కర్ పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధాన రహదారులపై దళిత సంఘాలు ఆందోళన దిగాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం రూరల్ పేరురు వై జంక్షన్ వద్ద దళితులు ఆందోళన చేపట్టారు. హైవే ను దిగ్బందం చేశారు. అణగారిన వర్గాలకు అంబెడ్కర్ ఎటువంటి హక్కులు కల్పించలేదు… బాబు జగజ్జీవన్ రామ్ మాత్రమే అణగారిన వర్గాలకు మేలు చేశాడంటూ ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలకు నిరసన గా కోనసీమ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా చేశాసారు.

పేరూరు వై జంక్షన్ వద్ద సుమారు గంట సేపు హై వే దిగ్బందం చేశారు. ఉండవల్లి శ్రీదేవి డౌన్ డౌన్, అజ్ఞాన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంటూ ప్ల కార్డు లు ప్రదర్శించి నినాదాలు చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే అంబెడ్కర్ కాళ్ళ మీద పడి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. తక్షణమే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన పదవికి రాజీనామా చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Also Read:

 భారత జట్టుకు అభినందనలు తెలిపిన గంగూలీ.. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించండంటూ ట్వీట్..

పాకిస్తాన్‌లో మళ్ళీ బాంబు దాడి.. నలుగురు మృతి.. 15 మందికి గాయాలు

 వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ.. వరిపొట్టుతో గ్లాసులు, ప్లేట్లు తయారు చేస్తున్న యువకుడు.. వీడియో వైరల్…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu