AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: మంచి రోజులొచ్చాయి గురూ.. రికార్డ్‌ ధర పలికిన కోణసీమ కొబ్బరి!

కొనసీమ రైతుల మంచిరోజులొచ్చాయి. అక్కడ పండేకొబ్బరికాయల ధర ఇప్పుడు రికార్డ్‌ స్థాయి రేటు పలుకుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ మార్కెట్‌లో వెయ్యి కొనసీమ కొబ్బరి కాయల ధర ఏకంగా 23వేల రూపాయలు పలికింది. దీంతో కోనసీమ కొబ్బరి రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది.

Andhra News: మంచి రోజులొచ్చాయి గురూ.. రికార్డ్‌ ధర పలికిన కోణసీమ కొబ్బరి!
Konaseema Coconuts
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jul 01, 2025 | 4:56 PM

Share

కోనసీమలో పండించే కొబ్బరికాయలకు ప్రస్తుతం జాతీయ మార్కెట్‌లో రికార్డు ధర పలుకుతోంది. చరిత్రలో మునిపెన్నడు చూడని విధంగా కొబ్బరి ధర పెరిగడంతో కోనసీమ రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది. పండించిన పంటకు మద్దతు ధర లభిస్తే.. అన్నదాతల కళ్లలో ఆనందంగాని అవదులే ఉండవు.. వారు నెలల పాటు పడిన కష్టానంత ఆ కొన్ని క్షణాల్లోనే మర్చిపోతారు. ఇప్పుడు కోనసీమ కొబ్బరి రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తాము పండించిన పంటకు చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో ధర పడకంతో దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జాతీయ మార్కెట్‌లో వెయ్యి కోనసీమ కొబ్బరి కాయలకు ఏకంగా 23వేల రూపాయలు ధర పలుకుతోంది.

ఈ ఏడాది ఆంధ్రా మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అనగా.. తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కొబ్బరి కాయల దిగుబడి భారీగి తగ్గిపోయింది. ఇది కాస్త ఆంధ్రా కొబ్బరి రైతులకు కలిసి వచ్చింది. పంట దిగుబడి సరిగా లేకపోవడం చేత.. కొబ్బరి చరిత్రలో తొలిసారి కోనసీమ కొబ్బరి కాయల ధర రూ.23 వేలు పలికింది. లంక గ్రామాల్లో అయితే వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.24 వేల వరకూ పలుకుతోందని రైతులు తెలిపారు. ఇదే తరహాలో కొబ్బరి ధర కొనసాగితే మున్ముందు కొబ్బరి రైతులు కొబ్బరి పంట పండించడానికి మరింత మొగ్గు చూపిస్తారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

గత ఏడాది ఇదే రోజుల్లో వెయ్యి కొబ్బరికాయల ధర రూ. 9000 పలకడంతో తాము తీవ్రంగా నష్టపోయేవారిమని రైతులు చెబుతున్నారు. అప్పటి ధరతో వచ్చే డబ్బులు రైతులు పెట్టుబడులకు, కూలీలకే సరిపోయేవని ఆవేదన వ్యక్తం చేసేవారు. దీంతో పంటను వదిలేసి కొందరు ఆక్వా చెరువులు త్రవ్వితే మరికొందరు కొబ్బరి తోటల నరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు మక్కువ చూపారు. కానీ ప్రజల్లో డబ్బులు మసలక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నష్టాల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా కొబ్బరి ధర ఆశాజనకంగా ఉండటంతో కొబ్బరి రైతులు, వ్యాపారులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..