AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: బాబుకు సవాల్‌గా సత్తెనపల్లి ఇష్యూ.. కస్సుమన్న కోడెల వారసుడు.. అధినేతకు రిక్వెస్ట్‌తో కూడిన బెదిరింపు..

ఇక్కడేం జరుగుతోందో నాకిప్పుడే తెలియాలి.. అంటూ పార్టీ అధినేతకు రిక్వెస్ట్‌తో కూడిన చిన్నపాటి బెదిరింపు సందేశమే ఇచ్చారు కోడెల శివరామ్. బాలయోగి, ఎర్రన్నాయుడు, బొజ్జల, పరిటాల రవి, భూమా కుటుంబాలకు బాసటగా నిలబడ్డ పార్టీ.. కోడెల కుటుంబాన్ని మాత్రం ఎందుకు విస్మరిస్తుంది అంటూ నిలదీసినంత పని చేశారు. టోటల్‌గా సత్తెనపల్లి టీడీపీ చంద్రబాబుకు కొత్త సవాల్‌గా మారింది.

TDP: బాబుకు సవాల్‌గా సత్తెనపల్లి ఇష్యూ.. కస్సుమన్న కోడెల వారసుడు.. అధినేతకు రిక్వెస్ట్‌తో కూడిన బెదిరింపు..
Tdp
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 25, 2023 | 3:51 PM

Share

ఇక్కడేం జరుగుతోందో నాకిప్పుడే తెలియాలి.. అంటూ పార్టీ అధినేతకు రిక్వెస్ట్‌తో కూడిన చిన్నపాటి బెదిరింపు సందేశమే ఇచ్చారు కోడెల శివరామ్. బాలయోగి, ఎర్రన్నాయుడు, బొజ్జల, పరిటాల రవి, భూమా కుటుంబాలకు బాసటగా నిలబడ్డ పార్టీ.. కోడెల కుటుంబాన్ని మాత్రం ఎందుకు విస్మరిస్తుంది అంటూ నిలదీసినంత పని చేశారు. టోటల్‌గా సత్తెనపల్లి టీడీపీ చంద్రబాబుకు కొత్త సవాల్‌గా మారింది.

పల్నాట కీలక నియోజకవర్గం సత్తెనపల్లి. తెలుగుదేశంలో ఒకప్పుడు కీలక నేత కోడెల శివప్రసాదరావుకు అడ్డా. కానీ.. ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితుల్లో మార్పులొచ్చేశాయా? ఇటీవల జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అటువంటి సంకేతాల్నే ఇచ్చిందట. చంద్రబాబు పర్యటన నేపథ్యంతో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అందుబాటులో లేని కారణంగా కోడెల తనయుడు శివరాం రాలేకపోయారు.

సమావేశం ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు నేతలు. అక్కడ ఏదో మిస్సయిందే అని ఆలోచించిన కొందరు కార్యకర్తలకు కోడెల విగ్రహం గుర్తుకొచ్చింది. వెంటనే తీసుకురమ్మని ఆయన అనుచరులు భావించినా, సకాలంలో కోడెల విగ్రహం చేరుకోలేదు. కోడెల విగ్రహమే కాదు, కోడెల ఊసు లేకుండానే సమావేశం ముగిసింది. సరిగ్గా ఇక్కడే ఇబ్బంది పడ్డారు కోడెల శివరామ్. సత్తెనపల్లికి వచ్చీరాగానే మీడియా ముందు మొత్తం కక్కేశారు. మేం చేసిన నేరమేంటి? పార్టీ కోసం ప్రాణాలర్పించిన నేతను విస్మరిస్తారా? ఇదెక్కడ అన్యాయం అంటూ అధిష్టానానికి తగిలేలా సౌండిచ్చారు.

క్రమంగా సత్తెనపల్లిలో నాన్న పేరు వినిపించకుండా కుట్ర జరుగుతోందని, దీని వెనుక ఎవరున్నారో నాకిప్పుడే తెలియాలి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కోడెల శివరామ్. ఇటీవలే పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా ప్రస్తావించడంతో పార్టీ క్యాడర్‌లో కలకలం రేగింది.

అధికార పార్టీ నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భరిస్తున్నానని, తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబే తనకు న్యాయం చేయాలని కోరుకున్నారు కోడెల. పార్టీ అధినేత రానున్న ఈ కీలక సమయంలో సత్తెనపల్లి టీడీపీలో అసంతృప్తి మంటలు రేగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సత్తెనపల్లి టీడీపీలో మూడు గ్రూపులున్నాయని, కోడెల శివరాం, మల్లి, వైవి ఆంజనేయులు వర్గాల మధ్య పొసగటం లేదని పార్టీ కార్యకర్తల్లో ఒకటే గుసగుస.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..