AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kancharla Srikanth: కుప్పంలో సీఎం చంద్రబాబు గెలుపులో కీ రోల్.. ఇంతకీ ఎవరీ శ్రీకాంత్..!

కుప్పంలో కంచర్ల జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పంలో చక్రం తిప్పుతున్నాడు. రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కుప్పం టీడీపీ బాధ్యతల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు.

Kancharla Srikanth: కుప్పంలో సీఎం చంద్రబాబు గెలుపులో కీ రోల్.. ఇంతకీ ఎవరీ శ్రీకాంత్..!
Kancharla Srikanth
Raju M P R
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 03, 2024 | 8:38 PM

Share

కుప్పంలో కంచర్ల జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పంలో చక్రం తిప్పుతున్నాడు. రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కుప్పం టీడీపీ బాధ్యతల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లక్ష ఓట్ల టార్గెట్ గా చంద్రబాబు గెలుపు లో కీ రోల్ పోషించిన శ్రీకాంత్‌కు ఇంత ప్రియారిటీ ఎందుకుంది. అసలెవరీ శ్రీకాంత్. అతని వ్యూహం ఏంటి..? ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కుప్పం. పరిచయం అక్కర్లేని ప్రాంతం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కుప్పం టీడీపీ మరింత బలోపేతం చేయడం, అభివృద్ధి ప్రతిపాదనల్లో ఇప్పుడు శ్రీకాంత్ కు ముందున్న లక్ష్యం. కుప్పంలో కీలకంగా మారిన శ్రీకాంత్ దూకుడుగా రాణిస్తున్నాడమే ఇప్పుడు చర్చ. 1989 నుంచి కుప్పం నుంచి వరుసగా గెలుస్తున్న చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో శ్రీకాంత్ పాత్ర కుప్పంలో కీ రోల్ గా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక నాయకత్వం పట్ల పార్టీ క్యాడర్ లో అసంతృప్తి పెరగడం, పీఏగా ఉన్న మనోహర్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో కుప్పం బాధ్యతల వ్యవహారంపై టీడీపీ దృష్టి పెట్టింది.

2024 సార్వత్రిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు కుప్పంలో పార్టీ క్యాడర్‌ను మరింత బలోపేతం చేయాలన్న నిర్ణయానికి రావడం కంచర్ల శ్రీకాంత్ ఎంట్రీ కి కారణమైంది. గత ఏడాది మార్చి నెలలో జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతుతో గెలిచిన కంచర్ల శ్రీకాంత్ పై కుప్పం టీడీపీ బాధ్యతలను ఆ పార్టీ హై కమాండ్ అప్పగించింది. ఇందులో భాగంగానే కంచర్ల శ్రీకాంత్ కుప్పంకు మకాం మార్చడంతో కుప్పంలో ఎవరీ కంచర్ల శ్రీకాంత్ అన్న చర్చ కు తెర తీసినట్లు అయ్యింది.

కుప్పం టిడిపిలో అసమ్మతిని తగ్గించే వ్యూహంలోనే శ్రీకాంత్ కు కుప్పం బాధ్యతలను అప్పగించింది టీడీపీ హై కమాండ్. ఇక, 2019 ఎన్నికల తర్వాతనే కుప్పంకు కొత్త పీఏను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు ఎట్టకేలకు 2023 ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత కంచర్ల శ్రీకాంత్ కు ఆ బాధ్యతను అప్పగించారు. ఎడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉండగా కుప్పం టీడీపీ బాధ్యతలను కంచర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు అప్పగించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ అదే దూకుడుతో కుప్పంలోనూ ప్రదర్శించేలా ప్రతి అడుగు వేసేందుకు ప్రయత్నించాడు.

కుప్పంలో ఎమ్మెల్సీగా ప్రోటోకాల్, మున్సిపాలిటీలో కో ఆప్షన్ మెంబర్ గా అవకాశం దక్కించుకున్న కంచర్ల శ్రీకాంత్ 2024 సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా వేసిన కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించిన శ్రీకాంత్ కుప్పంలో పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచించాడు. నియోజకవర్గంలో యూత్ ను అట్రాక్ట్ చేశాడు. వార్డు బాట, గ్రామ బాట కార్యక్రమాలతో 2024 ఎన్నికల కోసం టీం ను ఏర్పాటు చేసుకుని రాణించాడు. పాత తరం బ్యాచ్ ను పక్కనపెట్టి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించిన కంచర్ల శ్రీకాంత్ లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ప్లాన్ చేశాడు.

కుప్పంలో తన మార్క్ ఉండేలా చేసుకున్న కంచర్ల 2024 ఎన్నికల ప్రచారంలోనూ నారా, నందమూరి కుటుంబాలను తీసుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాన్ని మరింత బలహీనపరిచేలా ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీలో చేరికలకు తెరతీసిన కంచర్ల శ్రీకాంత్, మరోవైపు అభివృద్ధి పైనా ఫోకస్ పెట్టాడు. సీఎంగా చంద్రబాబుకు కుప్పంలో ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో టీడీపీ గల్లంతైన విషయాన్ని గుర్తుపెట్టుకుని రివర్స్ గేమ్ ప్రారంభించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసేలా ఎత్తుగడ వేస్తున్నారు.

ఇప్పటికే కుప్పంలో కౌన్సిలర్లు, కుప్పం, శాంతిపురం, గుడిపల్లిలో ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా, ఇక నెక్స్ట్ టార్గెట్ సర్పంచులు, వైసీపీలో కీలకంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడం కంచర్ల శ్రీకాంత్ చేస్తున్న ప్రయత్నం. ఇలా కుప్పంలో గేమ్ చేంజ్ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్ పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా అయినా ఇప్పుడు చక్రం తిప్పుతోంది మాత్రం కుప్పంలో కావడం, అది సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి కంచర్ల శ్రీకాంత్ పైనే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..