Uppada Beach: ఇళ్లు, గుళ్లు మాయం..! సముద్రంలో కలుస్తున్న తీర ప్రాంతం.. భయాందోళనలో ప్రజలు..

ఉప్పెన సినిమాలో చిత్రీకరించిన గుడి, ఇల్లు అన్ని మూడు, నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే సముద్రంలో కలిసిపోయాయి. కొన్ని రాళ్లు, సిమెంట్ రోడ్డు గోపురాలు మాత్రమే కనిపిస్తున్నాయి. భారీగా సముద్రం కోతకు గురవుతుంది అనడానికి నిదర్శనం ఉప్పాడ గ్రామమే.

Uppada Beach: ఇళ్లు, గుళ్లు మాయం..! సముద్రంలో కలుస్తున్న తీర ప్రాంతం.. భయాందోళనలో ప్రజలు..
Uppada Beach
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2023 | 11:22 AM

కేంద్ర భూ భౌతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖఇచ్చిన నివేదిక ప్రకారంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం తరచూ కోతకు గురవుతూ వస్తుంది. ఎక్కడ తూఫాన్ వచ్చిన దాని ప్రభావం ఇక్కడే ఉంటుంది. ఉప్పాడ గ్రామానికి కీలో మీటర్ల దూరంలో ఎక్కడో ఉంటే సముద్రం ఇప్పుడు ఉప్పాడ ఊరును మింగేస్తూ వస్తూంది. రోడ్లు, ఇళ్ళు, గుళ్ళులను సైతం సముద్రం కాలగర్భంలో కలిపేసుకుంటుంది. మత్స్యకార గృహాలు ఏడాది ఏడాదికి పదుల సంఖ్యలో కోల్పోతూ వందల గృహాలు కనుమరుగవుతున్నాయి. కొన్నాళ్లకు ఉప్పాడ ఊరే కనుమరుగు అయ్యే ప్రమాదం పొంచి ఉందని తీర ప్రాంతవాసుల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో పరిస్థితి అందం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం పర్యటకంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో ఎన్నో సినిమాల చిత్రీకరణలు జరిగుతుంటాయి ఇటీవల సినిమా ఈ ప్రాంతంలోనే చిత్రీకరించిన ఉప్పాడ సినిమా ఎంతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. గుడి సన్నివేశాలతో పాటు కొన్ని మత్స్యకార గృహాలలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అప్పుడు ఉప్పెన సినిమాలో చిత్రీకరించిన గుడి, ఇల్లు అన్ని మూడు, నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే సముద్రంలో కలిసిపోయాయి. కొన్ని రాళ్లు, సిమెంట్ రోడ్డు గోపురాలు మాత్రమే కనిపిస్తున్నాయి. భారీగా సముద్రం కోతకు గురవుతుంది అనడానికి నిదర్శనం ఉప్పాడ గ్రామమే.

ఇదే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోనసీమలోని అంతర్వేది, ఓడలరేవు మొదలుకుని కాకినాడ, ఉప్పాడ, అల్లవరం..తుని అద్దర్ పేట వరకు కేంద్ర భౌతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు 90 కిలోమీటర్ల మేర తీర భూభాగం కోతకు గురవడంతో తీర ప్రాంతవాసులు తీరం వెంబడి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు దీనిపై స్పందించకపోతే భవిష్యత్తులో సముద్రం చొచ్చుకుని వచ్చి ఊర్లకు ఊళ్లే కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురిగి ప్రాంతం ఏదైనా ఉందంటే ఉప్పాడ తీర ప్రాంతం. ముందుకు చచ్చిపోస్తున్న కెరటాల దాటికి ఇల్లు సైతం సముద్ర భూగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ముందు ముందుకు ఇల్లు కట్టుకుంటూ వెళ్తున్నామని.  ఇలా సముద్రం కోతకు గురై ముందుకు వస్తే మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లి అవకాశం ఉంటుందంటున్నారు మత్స్యకారులు.  పది పదిహేను కిలోమీటర్లు దూరం ఉండే సముద్రం అంతకంతకు ముందుకు వస్తుందని..  కోత దాటికి సర్వం కోల్పోతున్నామంటున్నారు మత్స్యకారులు. కేంద్ర మంత్రి చెప్పిన విధంగానే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రతీరా ప్రాంతానికి సముద్ర కోత ముంపు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Reporter: Satya

మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి