Vegetable Price: మార్కెట్‌లో పెరిగిన కూరగాయల ధరలు.. అన్నదాతకు ఊరట..
మార్కెట్ లో కూరగాయల ధరలు పెరగడానికి ఎండలు ఎక్కువ కావడం.. నీటి కొరత తో ఉత్సత్తి తగ్గడమే అని అంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో రైతులకు తాజాగా పెరిగిన ధరలతో కొంచెం ఊరట లభించింది
ఓ వైపు క్రమంగా ఎండలు మండుతున్నాయి.. మరోవైపు కూరగాయల ధరలు సుర్రుమనిస్తున్నాయి. గత కొంతకాలంగా కనీస ధర లేక.. ధర రాక నష్టపోతున్న కూరగాయలు పండించే రైతన్నకు కొంచెం ఊరట కల్పిస్తూ.. టమాటా, చిక్కుడు, పచ్చిమిర్చి, సహా పలు కూరగాయల ధరలు పెరిగాయి. ఇలా మార్కెట్ లో కూరగాయల ధరలు పెరగడానికి ఎండలు ఎక్కువ కావడం.. నీటి కొరత తో ఉత్సత్తి తగ్గడమే అని అంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో రైతులకు తాజాగా పెరిగిన ధరలతో కొంచెం ఊరట లభించింది. ఆస్పరి రైతు మార్కెట్‌లో కూరగాయల ధరలెలా ఉన్నాయో చూద్దాం..
ఆస్పరి కూరగాయల మార్కెట్ లో పెరిగిన ధరలు: కిలో పచ్చిమిర్చి రూ. 35 నుంచి రూ.40 వరకు పలుకుతుంది. 20 కిలోల పచ్చిమిర్చి బస్తా 700 రూ 800 రూ వరకు హోల్ సేల్ మార్కెట్ లో అమ్ముడవుతుంది.
కిలో వంగా రూ.30 ఉండగా.. 20 కిలోల వంగ బస్తా రూ. 600 గా ఉంది. మరోవైపు కిలో బీరకాయ రూ. 40. 20 కిలోల బీరకాయ గంప రూ. 800 లకు లభిస్తుంది. కిలో కాకరకాయ రూ. 40 లు ఉండగా.. 20 కిలోల కాకరకాయ గంప రూ. 800 లు కొనసాగుతుంది. ప్రస్తుతం కూరగాయల కు రేట్లు పెరగడంతో రైతులకు కాస్త ఊరటలభించినట్లు అయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..