Nara Lokesh: 17వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. నేడు తిరుపతి జిల్లాలోకి అడుగు..
నేటితో నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర పూర్తి చేసి.. తిరుపతి జలాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర 201.2 కిలో మీటర్ల జరిగింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 17వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం కొత్తూరు నుంచి ఉదయం 11.30 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. నేడు కూడా చిత్తూరుజిలాల్లో కొనసాగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గం తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తిరివేడు వద్ద స్థానికులతో సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు లంచ్ బ్రేక్ అనంతరం తీసుని.. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.
సాయంత్రం 4.40 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం డీఎం. పురం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు ద్వారకా నగర్ చేరుకుని లోకేష్ అక్కడే బస చేయనున్నారు.
నేటితో నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర పూర్తి చేసి.. తిరుపతి జలాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర 201.2 కిలో మీటర్ల జరిగింది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..