Venkaiah Naidu: ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే రాజధాని ఏర్పాటు చేయాలన్న వెంకయ్య నాయుడు

ఏపీ రాజధానిపై వెంకయ్య పరోక్ష వ్యాఖ్యలు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రజాభిప్రాయంతోనే ముందుకెళ్లాలంటూ సూచనలు చేశారు.

Venkaiah Naidu: ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే రాజధాని ఏర్పాటు చేయాలన్న వెంకయ్య నాయుడు
Venkaiah Naidu
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2023 | 6:58 AM

పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలోని SRKR ఇంజినీరింగ్‌ కాలేజ్‌ 43వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో రెండున్నర కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన యాక్టివ్‌ ఐడియా ల్యాబ్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కాలేజీలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్‌ అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు వెంకయ్య నాయుడితో కాసేపు చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడుని విద్యార్థులు ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా అమరావతిని చూడాలా.. వైజాగ్ ని చూడాలా.. మీరు క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ వెంకయ్య నాయుడుని విద్యార్థినిలు అడిగారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరణమ చేసిన తానూ రాజకీయాల్లోని వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదని చెప్పారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తన అభిప్రాయం చెప్పానని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు.

తాను రాజకీయాల్లో లేను కాబట్టి, రాజకీయాలపై వ్యాఖ్యానిస్తే పెద్ద సమస్యగా మారుతుందన్నారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి తో కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని, పట్టణాభివృద్ధి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని వెంకయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..