Andhra Pradesh: ఏపీలో కోతకు గురవుతున్న తీర ప్రాంతం.. భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉందన్న కేంద్రం

రాష్ట్రంలో సముద్ర తీరం పెద్ద యెత్తున కోతకు గురవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీ లోనిమొత్తం 1027 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 295 కిలోమీటర్లు అంటే 29 శాతం తీరప్రాంతం వివిధ స్థాయిల్లో కోతకు గురైందనితాజాగా నిన్న పార్లమెంట్ లో కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ చేసిన ప్రకటన దాని తీవ్రతను తెలియ చేస్తోంది.

Andhra Pradesh: ఏపీలో కోతకు గురవుతున్న తీర ప్రాంతం.. భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉందన్న కేంద్రం
Coastline Of A P
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2023 | 9:03 AM

కేంద్ర భూ భౌతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ సముద్ర తీర ప్రాంతంలో భూభాగం వివిధ స్థాయిల్లో కోతకు గురైందని నివేదిక వెళ్ళిడించింది.. అందులో ఆంద్రప్రదేశ్ లో సుమారు 89.25 కి లో మీట్లర్ల మేర కోతకు గురిందని కేంద్రమంత్రి చెప్పడంతో ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి,కృష్ణ జిల్లా, నెల్లూరు,, విశాఖపట్నం, శ్రీకాకుళం మేర తీరం కోతకు గురయ్యిందని కేంద్రమంత్రి చేసిన ప్రకటన అందరినీ ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా విశాఖపట్నం నగరంలోని అర్ కే బీచ్ నుంచి రుషికొండ వరకు కల 15.42 కిలోమీటర్ల పొడవైన తీరం లో 3.5 కిలోమీటర్ల మేర కోతకు గురైందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ అధ్యయనం తాజాగా తేల్చింది.

ఆంధ్రప్రదేశ్‌కి సుమారు 970 కిలోమీటర్ల ఉన్న తీర ప్రాంతంలో 28.7 శాతం భూభాగం వివిధ స్థాయిల్లో కోతకు గురైందని..అత్యధికంగా తూర్పుగోదావరి 89.25 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురయినట్లు సర్వేలో వెల్లడైనట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఉష్ణమండల తుఫానులు, రుతుపవనాలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, విపరీత సంఘటనలు మొదలైన సహజ కారణాలతోపాటు… ఓడరేవులు, నౌకాశ్రయాలు, నదులు దెబ్బతినడం వంటివి కూడా తీరప్రాంత కోతకు కారణమని తెలిపారు. తీరం కోత వల్ల…. భూమి, ఆవాసాలు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతోపాటు… ఫిషింగ్ కార్యకలాపాలకు అవసరమైన స్థలం కోల్పోవడం వంటి నష్టాలను చవిచూడాల్సి వస్తోందని మంత్రి వివరించారు.. దీంతో తీర ప్రాంత వాసుల్లో కలవరం మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..