AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'మా గ్రామంలో వెలుగులు నింపండి సారూ!

‘మా గ్రామంలో వెలుగులు నింపండి సారూ!

Phani CH
|

Updated on: Feb 14, 2026 | 9:15 AM

Share

అల్లూరి జిల్లా దబ్బలపాడు గ్రామం ఆధునిక యుగంలోనూ చీకట్లో మగ్గుతోంది. 2014లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ పాడైపోవడంతో విద్యుత్ కష్టాలు రెట్టింపయ్యాయి. వన్యప్రాణుల భయం, వలసల మధ్య గిరిజనులు నిత్యం పోరాడుతున్నారు. తాజాగా 'డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమం ద్వారా అధికారులు స్పందించి, శాశ్వత విద్యుత్ పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

ఆధునిక యుగంలోనూ ఆ గ్రామం ఇంకా చీకట్లోనే మగ్గుతోంది. సూర్యాస్తమయం అయ్యిందంటే చాలు.. అక్కడ కాగడాలే దిక్కు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మారుమూల దబ్బలపాడు గిరిజనులు పడుతున్న విద్యుత్ కష్టాలు వర్ణనాతీతం. 2013-14లో ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఈ గ్రామానికి సోలార్ విద్యుత్ ప్లాంట్ మంజూరైంది. మూడేళ్ల పాటు వెలుగులు పంచిన ఆ ప్లాంట్, సాంకేతిక లోపాలతో మరమ్మతుకు గురై మూలకు చేరింది. అప్పటి నుండి గిరిజనుల బతుకులు మళ్లీ చీకటిమయమయ్యాయి. వన్యప్రాణుల భయం మధ్య, కాగడాల వెలుతురులో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ లేక, సౌకర్యాలు అందక ఇప్పటికే 15 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోగా, మిగిలిన కుటుంబాలు కొండపైనే పోరాటం చేస్తున్నాయి. తాజాగా ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ప్రారంభించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం ఈ గిరిజనుల్లో ఆశలు రేకెత్తించింది. గ్రామానికి చెందిన గిరిజనులు నేరుగా సీఎండీకి ఫోన్ చేసి, “హలో సార్.. మాకు కరెంటు లేదండి, కాగడాలతో బతుకుతున్నాం.. దయచేసి వెలుగులు నింపండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకోవాలన్నా, ప్రాణాలు నిలబెట్టుకోవాలన్నా విద్యుత్ సౌకర్యం అత్యవసరమని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, సోలార్ ప్లాంట్‌కు మరమ్మతులు చేయడమో లేదా శాశ్వత విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడమో చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్