AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains: కాకినాడ ఉప్పాడ తీరంలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం.. తీర ప్రాంత వాసుల్లో టెన్షన్‌ టెన్షన్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది.

Heavy Rains: కాకినాడ ఉప్పాడ తీరంలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం.. తీర ప్రాంత వాసుల్లో టెన్షన్‌ టెన్షన్
Rising Tides Off The Coast
Sanjay Kasula
|

Updated on: Nov 12, 2021 | 9:18 AM

Share

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో తీర ప్రాంత వాసుల్లో టెన్షన్‌ టెన్షన్ నెలకొంది. ఇక అటు విశాఖలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస కిరండల్ రైలుమార్గంలో కొండచరియలు విరిగిపడి పట్టాలపై పడ్డాయి బండరాళ్లు. అనంతగిరి మండలం చిమిడిపల్లి సమీపంలో ట్రాక్‌పై బండరాళ్లు పడటంతో ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకొని పట్టాలపై పడిన రాళ్లను తొలగిస్తున్నారు.

ఏపీపై మరో 24 గంటల పాటు వాయుగుండం ఎఫెక్ట్‌ ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. కుండపోత వానలకు చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు అధికారులు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

అయితే ఇప్పటికే వాయుగుండం ఎఫెక్ట్‌తో విలవిలలాడుతున్న ప్రజలకు..మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. అండమాన్‌లో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని..ఈ నెల 17న కోస్తాంధ్ర వద్ద తీరం దాటనుందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..