Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ధరల్లో భారీ ప్రభావం కనిపించకున్నా.. కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని చోట్ల కొద్దిగా పెరిగాయి. ఇదిలాఉంటే..

Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Petrol Diesel Prices
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 12, 2021 | 9:08 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో తగ్గుతుండగా.. మరికొన్ని చోట్ల పెరుగుతోంది. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ధరల్లో భారీ ప్రభావం కనిపించకున్నా.. కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని చోట్ల కొద్దిగా పెరిగాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.27గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.49గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.88గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.77గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.15గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.29కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.66లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.57 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.66గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.29లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.95గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.13గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.23గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.29 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.36లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..