JR NTR Fans: కొందరేమో రా రమ్మని అంటున్నారు.. మరికొందరేమో వద్దు రావొద్దు అంటున్నారు.. నారా వారి సర్కిల్‌లో నందమూరి చిన్నోడు

"రావాలి జూనియర్‌... కావాలి ఎన్టీఆర్‌" అంటున్నారు కుప్పం తెలుగు తమ్ముళ్లు. ఈ డిమాండ్ రాష్టవ్యాప్తంగా ఎంతోకాలంగా ఉన్నప్పటికీ ఈ సారి నాలుగడుగులు..

JR NTR Fans: కొందరేమో రా రమ్మని అంటున్నారు.. మరికొందరేమో వద్దు రావొద్దు అంటున్నారు.. నారా వారి సర్కిల్‌లో నందమూరి చిన్నోడు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 26, 2021 | 7:18 PM

JR NTR Fans:  పంచాయతీ ఎన్నికల ఫలితాలు కుప్పంలో కాకరేపుతున్నాయి. ముఖ్యంగా అధినేత ఇలాకా కుప్పంలో వ్యతిరేక పవనాలు వీయడంతో స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు. కొందరైతే రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు కుప్పం పర్యటన ఆసక్తి రేపుతోంది. బాబు క్యాడర్‌లో ఆత్మస్థైర్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  “రావాలి జూనియర్‌… కావాలి ఎన్టీఆర్‌” అంటున్నారు కుప్పం తెలుగు తమ్ముళ్లు. ఈ డిమాండ్ రాష్టవ్యాప్తంగా ఎంతోకాలంగా ఉన్నప్పటికీ ఈ సారి నాలుగడుగులు ముందుకేసి జూనియర్‌ ఎన్టీఆర్‌ను కుప్పం తీసుకురావాలని ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుకే సరాసరి విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధినేత టూర్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ నినాదాలు  తెలుగుదేశం పార్టీలోనే  కొత్త చర్చకు దారితీస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజయవర్గంలోని శాంతిపురంలో చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా పెద్దయెత్తున జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలంటూ నినాదాలు చేశారు. ప్రచారానికి ఆయన్ను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

JR NTR

తాజాగా చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గుడిపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోను కూడా ఉంచారు తెలుగు తమ్ముళ్లు. గతంలో చంద్రబాబు, జూనియర్‌ పక్కపక్కనే కూర్చున్న ఫొటోతో బ్యానర్లు కట్టారు. అందులో హరికృష్ణ, బాలకృష్ణ ఫొటోలను కూడా పెట్టారు. ఇవాళ శాంతిపురంలో ఏకంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారానికి తీసుకురావాలని కార్యకర్తలు డిమాండ్‌ చేయడం తెలుగుదేశం పార్టీలోనేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ వర్గాల్లో ఇది ఆసక్తికర అంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయం కొత్త కాదన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన టీడీపీ తరఫున ప్రచారం చేశారు కూడా. ఆ తర్వాత దూరం జరిగారు. అయితే.. టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా రియాక్టయ్యే అవకాశం ఉంది.. తన తాతగారు పెట్టిన పార్టీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాజకీయంలోకి వస్తారా.. రారా? అనే సందేహాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

JR NTR

అయితే, ఇదే సమయంలో మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తారక్ రాజకీయాల్లోకి రావద్దని కోరుతున్నారు. సినిమాల్లోనే కొనసాగాలని వారు ఎన్టీఆర్ కు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలన్న కొందరి ప్రయత్నాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు.  ఈ మేరకు తమ అభిమాననటుడుకి తమ వెర్షన్ సోషల్ మీడియా వేదికగానూ వివరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? రాజకీయాలపై ఆయన ఫోకస్‌ ఎలా ఉంది? అనే అంశాలు ప్రస్తుత చర్చలో భాగం అయ్యాయి. గతంలో ఎన్టీఆర్ పార్టీ మారాతారన్న ప్రచారం జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అన్ని రూమర్స్ కొట్టిపడేశారు. ఇప్పుడు ఇంతలా వస్తున్న ఒత్తిడికి ఆయన ఎలా చెక్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, చంద్రబాబు మాత్రం దీనిపై ఆచితూచి స్పందించారు. లోకేష్ సహా అందరు నేతలు వస్తారంటూ చెప్పుకొచ్చారు. అధినేత మనసులో ఏముందో ఏమో కానీ… తమ్ముళ్లు మాత్రం జూనియర్‌ కోసం తెగ ఆరాటపడుతున్నారు.

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్