Andhra Pradesh: టీడీపీ, జనసేన పొత్తుల విషయంలో మరో కీలక అడుగు.. ఈ నెల 18 నుంచి..

టీడీపీ-జనసేన పొత్తు కుదిరి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ సరైన కార్యాచరణ ప్రకటించలేదు. దీంతో ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపై ప్రధానంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మ‌డి మేనిఫెస్టోతో పాటు ప్రజా సమస్యలపై ఎలా ముందుకెళ్లాలని దానిపై స్పష్టతకు వచ్చారు. ఇటీవల చంద్రబాబు-పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు కూడా ఈ సమావేశంలో..

Andhra Pradesh: టీడీపీ, జనసేన పొత్తుల విషయంలో మరో కీలక అడుగు.. ఈ నెల 18 నుంచి..
TDP, Janasena
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Nov 09, 2023 | 7:08 PM

తెలుగుదేశం-జనసేన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ రెండో సమావేశం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. రాజమండ్రి లో జరిగిన మొదటి సమావేశానికి కొనసాగింపుగా గురువారం జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి కమిటీలోని 12 మంది సభ్యులతో పాటు నారా లోకేష్ కూడా హాజరయ్యారు.

టీడీపీ-జనసేన పొత్తు కుదిరి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ సరైన కార్యాచరణ ప్రకటించలేదు. దీంతో ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపై ప్రధానంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మ‌డి మేనిఫెస్టోతో పాటు ప్రజా సమస్యలపై ఎలా ముందుకెళ్లాలని దానిపై స్పష్టతకు వచ్చారు. ఇటీవల చంద్రబాబు-పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు కూడా ఈ సమావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఇప్ప‌టికే ఉమ్మ‌డిగా కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డం ఆల‌స్యం కావడంతో ఇక‌పై దూకుడుగా ముందుకెళ్లాల‌ని రెండు పార్టీలు నిర్ణయించాయి. అంతేకాదు ఇక‌పై ఎక్క‌డికి వెళ్లినా రెండు పార్టీలు క‌లిసే వెళ్లాల‌ని, ఎలాంటి ఉద్య‌మాలు గానీ, ఫిర్యాదులు గానీ చేయాల్సి వ‌చ్చినా రెండు పార్టీల ప్ర‌తినిధులు క‌లిసే వెళ్లాల‌ని జేఏసీలో నిర్ణయించారు. వ‌చ్చే వారం నుంచి చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌పై ఓ షెడ్యూల్ కూడా సిద్దం చేశారు. ఈనెల 18 నుంచి ఉమ్మ‌డి పోరాటాల‌కు కార్యాచ‌ర‌ణ సిద్దం చేశారు.

జేఏసీ స‌మావేశంలో తీసుకున్న కీల‌క నిర్న‌యాలు ఇవే.. టీడీపీ-జ‌న‌సేన పొత్తు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టికీ ఎవ‌రికి వారే అన్న‌ట్లు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులున్నాయి. అందుకే ఇక రెండు పార్టీలు ఒక‌టే అనేలా ముందుకెళ్లేలా కార్యాచ‌ర‌ణ సిద్దం చేశాయి. ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి ఇకపై జేఏసీ సమావేశాలు ఆయా పార్టీల కేంద్ర కార్యాల‌యాల్లోనే ఏర్పాటుచేయాల‌ని నిర్ణయించారు. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి మేనిఫెస్టో అంశంపై చ‌ర్చ జ‌రిగింది. రాజ‌మండ్రిలో జ‌రిగిన మొద‌టి స‌మావేశంలో మేనిఫెస్టోపై చ‌ర్చ జ‌రిగింది. తాజాగా ఉమ్మ‌డి మినీ మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌కు రెండు పార్టీల నుంచి ముగ్గురేసి స‌భ్యుల చొప్పున క‌మిటీ ఏర్పాటు చేసింది జేఏసీ. ఈ క‌మిటీ మొద‌టి స‌మావేశం ఈనెల 13న జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌క‌టించిన భ‌విష్య‌త్తుకు గ్యారంటీ లోని ఆరు ప‌థ‌కాల‌తో పాటు జ‌న‌సేన కూడా నాలుగైదు ప్ర‌తిపాద‌న‌లు ముందుంచింది.

ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చించి ఈనెల 17న మినీ మేనిఫెస్టో ప్ర‌క‌టించే దిశ‌గా ముందుకెళ్తున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే రెండు పార్టీలు క్షేత్ర‌స్థాయిలో ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లేలా ఉమ్మడి జిల్లా స్థాయిలో స‌మ‌న్వ‌య సమావేశాలు జ‌రిగాయి. ఈనెల 14,15,16 తేదీల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గ‌,గ్రామ‌స్థాయిలో రెండు పార్టీలు క‌లిసి పోరాటాలు చేయ‌డంపై ఈ సమావేశాల్లో చర్చించారు. రెండు పార్టీలోని అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాల్లో ముందుగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఉద్య‌మం చేయ‌నున్నారు. ఈనెల 18,19 తేదీల్లో రోడ్ల ప‌రిస్థితిపై ఉమ్మ‌డి ఆందోళ‌న‌లునిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించాల‌ని నిర్ణయించారు.

రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవరకూ పోరాటం చేయాల‌ని నిర్న‌యించారు…రోడ్లు,మద్యం,విద్యుత్ చార్జీల పెంపు,ఇసుక పై పోరాటాలు…ఇలా ప్రతి 15 రోజులకూ ఒక సమస్యపై ఉద్యమం చేయాల‌ని జేఏసీ స‌మావేశంలో నిర్ణయించారు. బీసీలపై దాడులకు నిరసనగా కార్యక్రమాలు, ఓటర్ జాబితాలో అక్రమాలపై కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల స‌మ‌స్య‌లు, యువ‌తకు సంబంధించిన అంశాల‌పైనా క‌లిసి ముందుకెళ్లాల‌ని జేఏసీ స‌మావేశంలో నిర్ణయించారు.

ఇప్పుడు మినీ, త‌ర్వాత ఫుల్ మేనిఫెస్టో..

కొంత‌కాలంగా టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి మేనిఫెస్టో పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతుంది. రాజ‌మండ్రిలో జ‌రిగిన జేఏసీ సమావేశంలో మేనిఫెస్టోపై చ‌ర్చించారు. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని స్వ‌యంగా నారా లోకేష్ ప్ర‌క‌టించారు. అయితే చంద్ర‌బాబుకు మ‌ధ్యంత‌ర బెయిల్ రావ‌డం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందుబాటులో లేక‌పోవ‌డంతో అది కాస్తా వాయిదా ప‌డింది. తాజాగా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌కు రెండు పార్టీల నుంచి ముగ్గురేసి స‌భ్యుల చొప్పున క‌మిటీ వేశారు. వారం రోజుల్లోగా మినీమేనిఫెస్టోను విడుద‌ల చేయాల‌ని రెండు పార్టీలు నిర్ణయించా. ఆ త‌ర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుద‌ల చేయాల‌ని ఉమ్మ‌డి క‌మిటీ స‌మావేశంలో నిర్ణయించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..