జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమంటూ అధికారపార్టీకి కౌంటర్ ఇచ్చారు. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని.. ఉడుత ఊపులకు జనసేన భయపడదంటూ అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ‘2024 కీలకమైన ఎన్నికలు. 175 స్థానాల్లో గెలుస్తామని వైసీసీ విర్రవీగుతోంది. ఎలా గెలుస్తారో నేను చూస్తా. ఆంధ్రాలోనే పుట్టాను. ఆంధ్రాలోనే తేల్చుకుంటాను. ఇప్పటివరకు చేసిన బానిసతనం చాలు. ఇప్పటం కూల్చివేతలన్నీ అధికార పార్టీ కూల్చివేతలే. పథకాలకు జగనన్న విద్యా దీవెన అని పేరు ఎందుకు పెడతారు? గుర్రం జాషువా అని ఎందుకు పెట్టరు? పింగళి వెంకయ్య అని క్యాంటీన్ నామకరణం చేయలేరా? అధికార పార్టీ నేతలు అండర్ గార్మెంట్స్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూడా డబ్బులు అడుగుతున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం పోరాడుతాను. ప్రధానితో ఏం మాట్లాడానో సజ్జలకు ఏం తెలుసు. జనసేన నాయకులను రౌడీలంటే వివేకాను చంపిన వాళ్లను ఏమనాలి. ‘ అని అధికార పార్టీ నేతలను పవన్ ప్రశ్నించారు.
‘భూసేకరణ లో భూములు తీసుకోవడం, అభివృద్ధి కోసం నిర్మాణాలను కూల్చడం ఎక్కడైనా జరుగుతుంది. కానీ ఇప్పటంలో జరుగుతున్నది వేరు. పడగొడితే నష్టపరిహారం భారీగా ఇవ్వాలి. ఇప్పటంలో అది జరగడం లేదు. ఇక్కడి ప్రజల గుండెకు దెబ్బ తగిలింది. జనసేన ఆ గాయానికి మందు రాస్తుంది. ఇప్పటం గ్రామస్తుల పోరాటం అమరావతి రైతులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని జనసేనాని తెలిపారు. ఆయన ఇంకా ఏం మాట్లాడాడో ఈ కింది వీడియోలో చూడండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..