YS Viveka Murder Case: వివేకా కేసులో కొత్త ట్విస్టు.. ఆయన అల్లుడు, బావమరిది హస్తం ఉందన్న తులసమ్మ

ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని కూడా విచారించాలంటూ సీబీఐని ఆదేశించాలని A-5 ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య కోర్టును ఆశ్రయించారు. దీంతో వివేకా కేసులో కొత్త ట్విస్టుకు తెర లేచింది.

YS Viveka Murder Case: వివేకా కేసులో కొత్త ట్విస్టు.. ఆయన అల్లుడు, బావమరిది హస్తం ఉందన్న తులసమ్మ
A5 Devireddy Shankar Reddy Wife Tulisamma
Follow us

|

Updated on: Nov 27, 2022 | 1:33 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసును సీబీఐ ఒక కోణంలోనే చూసిందా? ఒకవైపు చూసి, విని మాత్రమే దర్యాప్తు చేసిందా? అవుననే అంటున్నారు హత్య కేసులో A-5 ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ. వివేకా హత్యలో ఆర్థిక, కుటుంబ, వివాహేతర అంశాలు ఉన్నాయంటూ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ఆమె వేసిన పిటిషన్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను పులివెందుల కోర్టు శనివారం రికార్డ్‌ చేసింది. మరో ఆరుగురిని కూడా ఈ కేసులో విచారించాలంటూ సీబీఐని ఆదేశించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో దీంతో వివేకా కేసులో కొత్త ట్విస్టుకు తెర లేచింది.

వివేకా అల్లుడితో సహా ఆరుగురిని విచారించాలి : తులసమ్మ

వివేకా హత్యకేసులో నిందితుడు A5 దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో వివేకా అల్లుడు, అతని బావమరిది, టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి మరో ముగ్గురుని కూడా నిందితులుగా చేర్చాలంటూ ఆమె పేర్కొన్నారు. ఆ ఆరుగురిని సీబీఐ విచారించేలా ఆదేశించాలంటూ కోర్టును ఆమె అభ్యర్థించారు. వివేకా హత్యకు ముందు పిటిషన్‌లో తాను పేర్కొన్న ఆరుగురి కాల్ డేటాను కోర్టుకు సమర్పించారు తులసమ్మ. ఈ పిటిషన్ పై పులివెందుల కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేశారు. పిటిషనర్ తో పాటు సాక్షులను కూడా డిసెంబర్ 24 న విచారణకు రమ్మని కోర్టు ఆదేశించింది. దీంతో వివేకా హత్య కేసులో తెర పైకి కొత్త ట్విస్ట్ వచ్చింది.

పులివెందుల కోర్టులో పిటిషన్ వేసిన తులసమ్మ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణలో కొన్ని అంశాలను సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు. అంతే కాక ఈ కేసులో మరో ఆరుగురుని కూడా సిబిఐ విచారించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక అంశాలు , కుటుంబ వివాదాలు , వివాహేతర సంబంధాలు ముడిపడి వున్నాయని , ఆ అంశాలను వేటినీ సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు తులసమ్మ. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, కొమ్మా పరమేశ్వర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లను సిబిఐ విచారించే విధంగా ఆ సంస్థను ఆదేశించాలని పులివెందుల కోర్టును ఆమె కోరారు. తులసమ్మ పిటిషన్ పై 9 నెలల తర్వాత శనివారం వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరినట్టయింది.

తులసమ్మ వాంగ్మూలంపై ఆమె లాయర్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవి రెడ్డి శంకర్‌రెడ్డి సతీమణి దేవి రెడ్డి తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఇచ్చిన పిటీషన్ మేరకు పులివెందుల మెజిస్ట్రేట్ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారని, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై అనుమానాలను ఈ పిటిషన్ లో వ్యక్తం చేసారన్నారు. సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఈ కేసులో కీలకమైన మరో ఆరుగురుని కూడా సిబిఐ విచారించాలని కోర్టులో తులసమ్మ పిటిషన్ వేసినట్లు వివరించారు. పిటీషన్ లో పేర్కొన్న అంశాలనే మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాగ్మూలంలో కూడా ఉన్నట్లు లాయర్ చెప్పారు.ఈ కేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్ లను సిబిఐ విచారించే విధంగా ఆదేశించాలని తులసమ్మ కోర్టును కొరారన్నరు. సిట్ విచారణలో సేకరించిన కాల్ డేటాను కూడా సీబీఐ పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలన్నారు. డిసెంబర్ 24 కి ఇతర సాక్షుల విచారణను వాయిదా వేశారని వివరించారు. కంప్లయింట్‌లో ముద్దాయిలుగా వివేకా అల్లుడితో పాటు మరో ఐదుగురిని ముద్దాయిలుగా పేర్కొన్నట్లు తులసమ్మ లాయర్‌ రవీంద్రారెడ్డి తెలిపారు.

ఫస్ట్‌ సిట్‌ విచారణ చేసినప్పుడు సేకరించిన కాల్‌డేటా ప్రకారం వేరే నిర్ధారణకు వచ్చారు. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత ఒక ముద్దాయిని అప్రూవర్‌గా మార్చి కేసును వేరేవిధంగా మార్చారనేది తులసమ్మ వాదన అని న్యాయవాది చెప్పారు. ఈ హత్య కేసులో వివేకా అల్లుడితో పాటు మరో ఐదుగురు ఉన్నారని, వాళ్లంతా కలిసి కుట్ర చేశారని, ఆస్తి గొడవల వల్ల వివేకా అల్లుడు కుట్ర చేసినట్టు పిటిషన్‌లో తులసమ్మ పేర్కొన్నారని లాయర్‌ చెబుతున్నారు. కేసును తప్పుదోవ పట్టించారంటూ ఆమె పేర్కొంటున్నారని లాయర్‌ తెలిపారు. డిసెంబర్‌ 24న కోర్టు విచారణ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..