AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Fans – Posani: పోసానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కొనసాగిస్తున్న పవన్ ఫ్యాన్స్

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతి

Pawan Fans - Posani: పోసానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కొనసాగిస్తున్న పవన్ ఫ్యాన్స్
Posani Pawan Fans
Venkata Narayana
|

Updated on: Sep 29, 2021 | 12:56 PM

Share

Pawan Kalyan Fans – Posani: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతి తాడేపల్లి ప్రాంతంలోని గుండిమెడలో సినీనటుడు పోసాని క్రిష్ణ మురళి దిష్టి బొమ్మ దహనం చేశారు ఆందోళనకారులు. పవన్ కళ్యాణ్ గురించి మరక్కొ మాట మాట్లాడితే, పోసాని భవిష్యత్ లో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ అభిమానులు హెచ్చరిస్తూ నినాదాలు చేశారు.

మరోవైపు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య ఫైర్ అయ్యారు. ఇప్పటికే లేఖ రిలీజ్ చేసిన జోగయ్య..  పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వైసీపీ మంత్రులు వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆరోపించారు.

ముఖ్యమంత్రి కాపులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ని ఆరాధించే కాపుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఆయన శపథం చేశారు. పోసాని కృష్ణ మురళి ఒక జోకర్ అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చేగొండి వెంకట హరిరామజోగయ్య కొట్టిపారేశారు.

Read also: Pawan Kalyan: మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకున్న పవన్.. దారిపొడవునా ఫ్యాన్స్ బ్రహ్మరథం