Pawan Kalyan: ఓ వైపు రాజకీయం.. మరోవైపు ఆధ్యాత్మికం.. వారాహి యాత్రలో నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష

వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్షను ఆచరించనున్నారు. మొదట ఉపవాస దీక్షను నవరాత్రులు చివరి మూడు రోజులు ఆచరించాలనుకున్న పవన్.. ఈరోజు నుంచే దీక్షను ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. 

Pawan Kalyan: ఓ వైపు రాజకీయం.. మరోవైపు ఆధ్యాత్మికం.. వారాహి యాత్రలో నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష
Pawan Kalyan
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 20, 2023 | 9:16 AM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎన్నికల కార్యరంగంలోకి దిగారు. తన ప్రచార రథం వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. అంతేకాదు ప్రచారంతో దూసుకుపోతూనే ఆధ్యాత్మిక దీక్షను కూడా కొనసాగిస్తున్నారు పవన్ కల్యాన్. నేటి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్షను ఆచరించనున్నారు. మొదట ఉపవాస దీక్షను నవరాత్రులు చివరి మూడు రోజులు ఆచరించాలనుకున్న పవన్.. ఈరోజు నుంచే దీక్షను ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగించనున్నారు జనసేనాని. వచ్చే నెల గురుపౌర్ణమి నాటినుంచి చాతుర్మాస దీక్ష కూడా ఎప్పటిలాగే ఆచరించనున్నారు పవన్ కళ్యాణ్. అందువల్ల ఈ ఉపవాస దీక్షను కార్తీక మాసాంతం వరకు కొనసాగించనున్నాట్లుగా తెలిపారు. దీక్షా కాలంలో పాలు, ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకొనున్నారు పవన్. లోక కల్యాణార్ధం ఇటీవల మంగళగిరిలో మహాయాగం నిర్వహించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ శాకాహారానికి మాత్రమే పరిమితమయ్యారు.

జూన్ 20న ముమ్మడివరంలో యాత్ర, సభలు జరుగుతాయి. జనసేన వారాహి యాత్ర జూన్ 21, జూన్ 22న వరుసగా అమలాపురం, పి.గన్నవరం నుంచి కొనసాగుతుంది. అనంతరం రాజోలు నియోజకవర్గంలో వారాహి యాత్ర, మకిలిపురంలో సభ నిర్వహించనున్నారు. చివరగా జూన్ 23న నర్సాపురంలో వారాహి యాత్ర, సభ జరగనున్నాయి. అవసరమైన అన్ని అనుమతులతో, జన సేన పార్టీ వారాహి యాత్ర మరియు బహిరంగ సభలకు సన్నద్ధమైంది, ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి సమస్యలను పరిష్కరించడానికి వారి నిబద్ధతను ప్రదర్శిస్తుంది.

మరోవైపు ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ .. మంగళగిరి జనసేన కార్యాలయంలో యాగం చేసిన సంగతి తెలిసిందే. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

‘రాసిపెట్టుకోండి.. బలంగా తిరిగొస్తా’.. కేటీఆర్ సంచలన ట్వీట్..
‘రాసిపెట్టుకోండి.. బలంగా తిరిగొస్తా’.. కేటీఆర్ సంచలన ట్వీట్..
మీకు ఆధార్‌ కార్డు ఉందా? UIDAI కీలక సమాచారం.. అదేంటో తెలుసా?
మీకు ఆధార్‌ కార్డు ఉందా? UIDAI కీలక సమాచారం.. అదేంటో తెలుసా?
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? ఏ దేశాలపై ప్రభావం చూపిస్తాయంటే
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? ఏ దేశాలపై ప్రభావం చూపిస్తాయంటే
నవ్వుల పువ్వులు మీ జీవితంలో వికసించాలంటే.. ఆనంద మార్గం ఇదే!
నవ్వుల పువ్వులు మీ జీవితంలో వికసించాలంటే.. ఆనంద మార్గం ఇదే!
పొదుపు మంత్రం పాటించాలనుకుంటున్నారా? వీటిల్లో పెట్టుబడి బెస్ట్
పొదుపు మంత్రం పాటించాలనుకుంటున్నారా? వీటిల్లో పెట్టుబడి బెస్ట్
షాకింగ్ విషయం చెప్పిన హాట్ బ్యూటీ
షాకింగ్ విషయం చెప్పిన హాట్ బ్యూటీ
ETF: ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటి..ఇది ఎలా పని చేస్తుంది?
ETF: ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటి..ఇది ఎలా పని చేస్తుంది?
మీరూ రోజూ పల్లీలు తింటున్నారా? ఈ అలవాటు మంచిదేనా..
మీరూ రోజూ పల్లీలు తింటున్నారా? ఈ అలవాటు మంచిదేనా..
వైకుంఠ ఏకాదశి రోజున ఏ వస్తువులను దానం చేస్తే శుభప్రదం అంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఏ వస్తువులను దానం చేస్తే శుభప్రదం అంటే..
మీరూ చీకట్లో మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
మీరూ చీకట్లో మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా