Pawan Kalyan: విజయనగరం పర్యటనకు జనసేనాని.. దారి పొడవునా బారులు తీరిన అభిమానులు, కార్యకర్తలు..

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆయన గుంకలాం గ్రామానికి బయల్దేరారు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ గ్రామంలోని..

Pawan Kalyan: విజయనగరం పర్యటనకు జనసేనాని.. దారి పొడవునా బారులు తీరిన అభిమానులు, కార్యకర్తలు..
Pawan Kalyan Tour
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 13, 2022 | 12:36 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆయన గుంకలాం గ్రామానికి బయల్దేరారు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ గ్రామంలోని జగనన్న కాలనీని పరిశీలించనున్నారు. పవన్ వస్తున్న దారి పొడవునా అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు బారులు తీరారు. ఆనందపురం కూడలి వద్ద గజ మాలతో జనసేనానిని ఘనంగా సత్కరించారు. కాగా.. గుంకలాంలో 397 ఎకరాల్లో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్దది కావడం విశేషం. 2020 డిసెంబరు 30 న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కాలనీకి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దూరంగా ఉండటం, కనీస సౌకర్యాలు లేకపోవడం, నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, ప్రభుత్వం అందిస్తున్న సహాయం చాలకపోవడం వంటి కారణాలతో పనులు పూర్తవడం లేదు. ఈ నేపథ్యంలోనే నిర్మాణాల్లో జరుగుతున్న అలసత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పవన్‌ గుంకలాంలో పర్యటిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. విశాఖలో రాజకీయాలు రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి. రుషికొండను ధ్వంసం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని కొట్టి పారేస్తోంది. గతంలో ఉన్న రుషికొండ ఫొటోలను, ప్రస్తుత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు రుషికొండ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా రుషికొండ తవ్వకాలపై పలు ఆరోపణలు చేశారు. అక్రమ తవ్వకాలు బయటపడతాయనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీతో భేటీ అయిన పవన్ రుషికొండ తవ్వకాలను పరిశీలించారు.

కాగా.. గతంలో పవన్ కల్యాణ్ చేపట్టిన విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. విశాఖ గర్జన అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారన్న ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం పవన్ కళ్యాణ్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయనను ముందుకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ కేసులో ఇద్దరు జనసేన నేతలు సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్. రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసులలో 25 మంది వరకు జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!