Tirumala: తిరుమల శ్రీవారి ప్రధానాలయం ముందు ఫోటోగ్రాఫర్ల అతి.. కెమెరాలు లాక్కుని హుండీలో వేసిన విజిలెన్స్ సిబ్బంది.. కారణం ఇదే..
భక్తులను ఇబ్బంది పెడుతున్నారని రెయిడ్స్ నిర్వహించారు. శ్రీవారి ఆలయం ముందు అనధికారిక ఫొటోగ్రాఫర్ల నుంచి కెమెరాలు లాక్కున్నారు. అనుమతి లేకుండా అక్కడ భక్తుల ఫోటోలు తీసి..
తిరుమల శ్రీవారి ప్రధానాలయం ముందు ఫోటోలు తీస్తున్న వారి కెమెరాలను లాక్కుని హుండీలో వేశారు విజిలెన్స్ సిబ్బంది. ఎస్, కొండపై అనధికార ఫోటోగ్రాఫర్లు పెరిగిపోయారని, భక్తులను ఇబ్బంది పెడుతున్నారని రెయిడ్స్ నిర్వహించారు. శ్రీవారి ఆలయం ముందు అనధికారిక ఫొటోగ్రాఫర్ల నుంచి కెమెరాలు లాక్కున్నారు. అనుమతి లేకుండా అక్కడ భక్తుల ఫోటోలు తీసి బిజినెస్ చేస్తున్నారని అభియోగం. ఈ మధ్యకాలంలో తిరుమలలో అనధికార ఫోటోగ్రాఫర్ల సంఖ్య పెరిగింది. తమను ఇబ్బంది పెడుతున్నారని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయని టీటీడీ చెప్తోంది. దీంతో రెయిడ్స్ నిర్వహించిన విజిలెన్స్ అధికారులు.. కెమెరాలు లాక్కుని హుండీలో వేశారు. మరోసారి దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుమల ఆలయ అధికారులు.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతాలు, సెలవు రోజులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు జన సంద్రాన్ని తలపించాయి. క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. 57,104 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీలకు రూ.4.66 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు స్వామి దర్శనానికి 40 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. చలి తీవ్రత కూడా పెరగడంతో క్యూ లైన్లల్లో ఉన్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు వరస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు తమ స్వంత వాహనాల్లో పయనమయ్యారు. దీంతో తిరుపతిలోని చెక్ పాయింట్ల వద్ద తనిఖీల కోసం వాహనాలు బారులు తీరాయి. 12 క్యూలైన్లలో క్షుణ్నంగా చెకింగ్ చేస్తుండటంతో వాహనాలు నత్త నడకన ముందుకు కదులుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..