ISRO: దేశ చరిత్రలో మరో మైలురాయి.. తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్..

భారత్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట రాకెట్‌ను ఇస్రో శాస్త్తవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే చేపట్టిన..

ISRO: దేశ చరిత్రలో మరో మైలురాయి.. తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్..
Private Rocket
Follow us

|

Updated on: Nov 18, 2022 | 12:08 PM

భారత్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట రాకెట్‌ను ఇస్రో శాస్త్తవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే చేపట్టిన ఇస్రో.. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపించినా రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే కావడం విశేషం. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రయోగం చేపట్టినట్లు అధికారులు, సైంటిస్టులు చెప్పారు. తద్వారా ఈ రంగంలో స్టార్టప్‌లు పెరిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ ఈ రాకెట్‌ను తయారు చేసింది. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం జరిగింది. తొలిసారిగా పంపిన ఈ రాకెట్ పేరు ప్రారంభ్. ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు నింగిలోకి వెళ్లిన విక్రమ్‌- ఎస్‌ రాకెట్‌ 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువు ఉంటుంది. భూమికి 103 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీహరికోటకు 115. 8 కిలోమీటర్ల దూరాన సముద్రంలో రాకెట్ పడిపోనుంది. కేవలం 4. 50 నిమిషాల్లోనే ఈ ప్రయోగం పూర్తి కానుంది.

పెద్ద మొత్తంలో నిధుల సమీకరించిన స్కైరూట్ లక్ష్యాలు భారీగానే ఉన్నాయి. ట్రిలియన్ డాలర్ స్పేస్ మార్కెట్ లో విపరీతమైన అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు ఈ రంగంలో స్టార్టప్ ను స్థాపించామని ఆ కంపెనీ సీఈఓ పవన్ కుమార్ అన్నారు. అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే తాము ఈ సంస్థను నెలకొల్పామన్నారు. అంతరిక్ష వ్యాపారంలో మరింత ఎదగడం కోసం స్కైరూట్- ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దిశగా అడుగులు వేసిన తొలి స్టార్టప్ స్కైరూట్. స్కైరూట్ నినాదమేంటంటే.. అందరికీ ఓపెన్ స్పేస్. ఈ పేరు మీద వీరు మొదలు పెట్టిన మిసన్ లో దీర్ఘకాలిక భాగస్వాములను ఆహ్వానిస్తున్నారు. స్పేస్ లో ఇకపై భారీ లాభాలుండబోతున్నాయని.. చెబుతూ.. ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..