GSLV-F10: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 రాకెట్ ప్రయోగం విఫలం.. మూడో దశలో గతి తప్పిన రాకెట్..
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మూడో దశలో రాకెట్ గతి తప్పింది..
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మూడో దశలో రాకెట్ గతి తప్పింది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఇస్త్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ ప్రకటించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లో జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–10) ప్రయోగించేందుకు బుధవారం వేకువజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఉదయం 5.43కు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించగా.. కాసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–10 ద్వారా అంతరిక్షంలో ఈవోఎస్-03 శాటిలైట్‌ను పంపించేందుకు ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయితే.. ఈవోఎస్-03 శాటిలైట్ రియల్ టైమ్ ఇమేజింగ్‌ను అందించేది. ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయం, అటవీ, నీటి వనరులతో పాటు విపత్తు హెచ్చరికలను అందించేది. తుఫాను పర్యవేక్షణ, కుండపోత వర్షాలను గుర్తించనుంది.