JC Prabhakar Reddy: టీడీపీ అభ్యర్ధుల జాబితా రెడీ అయ్యిందా..! ఇంట్రస్టింగ్‌గా మారిన జేసీ కామెంట్స్
ఏపీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల జాబితా రెడీగా ఉందని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. నాకు సీటు ఇవ్వకపోయినా ఫరవాలేదన్నారు. మా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీచేస్తారన్నారు అస్మిత్‌రెడ్డి. తాడిపత్రి నుంచి అసెంబ్లీకైనా, లోక్‌సభకైనా పోటీ చేస్తామన్నారు. సీటు కోసం తాము ఎవరినీ అడగడం లేదన్నారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా రెడీగా ఉంది అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. మూడు, నాలుగు రోజుల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఖరారు అయ్యే అవకాశం ఉన్నందువల్ల అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు జేసీ. ఇంకా వైసీపీలోనే టికెట్లు కన్ఫార్మ్ కాలేదు. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి.
175 నియోజకవర్గాలకు గాను మూడు నియోజకవర్గాలకు ఇప్పటికే టికెట్లు కేటాయింపు జరిగిపోయినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అంటూ ప్రకటించారు. మిగతావన్నీ కూడా లిస్ట్ అంతా రెడీగా ఉంది అన్నారు జేసీ. బీజేపీతో రెండు మూడు రోజుల్లో పొత్తు ఖరారయ్యే చాన్స్ ఉందన్నారు జేసీ. అందుకే లిస్ట్ కొంచెం ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు.ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు అంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
టికెట్ వస్తే చాలు గెలిచిపోతాం అన్న భ్రమలో నాయకులు ఉన్నారని.. జేసీ ఫ్యామిలీకీ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని అడిగామన్నారు జేసీ. పొత్తులో భాగంగా తాడిపత్రికి కూడా ఎవరైనా టికెట్ అడిగితే త్యాగం చేయాల్సి ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాకు ఒక్క టిక్కెట్ ఇచ్చినా, పార్టీ కోసం పని చేస్తామన్నారు ప్రభాకర్ రెడ్డి. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా టికెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ లేకపోయినా పరవాలేదు.. కానీ జేసీ కుటుంబం నుంచి కచ్చితంగా పోటీలో ఎవరో ఒకరు ఉంటారన్నారు అస్మిత్ రెడ్డి. మేము పార్టీ కోసం కష్టపడుతున్నామన్న భావన టీడీపీ అధిష్టానంలో ఉంటే రెండు టికెట్లు ఇస్తారు. లేదంటే ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ జేసీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో ఉంటారని జేసీ అస్మిత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..