International Indigenous Day: ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు.. స్పెషలట్రాక్షన్‌గా నిలిచిన ఐఏఎస్ నవ్య
International Indigenous Day: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపిలోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్..
International Indigenous Day: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, ఐటీడీఏ పీవో బి. నవ్య, ఐఏఎస్ లు పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, ఐటీడీఏ పీవోలు గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో ఐటిడిఎ పివో బి.నవ్య స్పెషలట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ ఆదివాసీ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివాసీ వేషాధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. నవ్య నృత్యంతో పాటు గిరిజన, ఆదివాసీలతో సరదాగా కలిసి పోయి తన హావభావాలతో వారికి కుటుంబ సభ్యురాలిలా చేరువయ్యే ప్రయత్నం చేశారు.
మాటామాట కలిపి ముచ్చటించి నేను మీ మనిషినే అని అందరిని పలకరించి అందరిని ఉత్సాహపరిచారు. ఉత్సవాల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్న నవ్యకు గిరిజనులు తమ సంప్రదాయ కానుకలు అందజేసి ప్రశంసించారు. అధికారులు ప్రజల సొంత మనిషిలా కలిసిపోతే మరిన్ని సమస్యలు తెలుసుకొని ప్రజల కష్టాలను తీర్చే అవకాశం వస్తుందని ఐఏఎస్ నవ్య అన్నారు.
కాగా, ఆదివాసీలు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 దేశాలకుపైగా ఉన్నారు. వీరి సంఖ్య 37 కోట్లకుపైగానే ఉంది. ఇక భారత్‌లో కూడా ఆదివాసీలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు బీహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతమున్న టెక్నాలజీలో ఆదివాసీలు వారి సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు. టెక్నాలజీ రంగం ఎంతో అభివృద్ధి చెందినా.. వారు మాత్రం తమ అడవిని వదిలి బయటకు రారు. అడవి ప్రాంతాల్లోనే ఉంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి