AP Weather: అల్పపీడనానికి తోడైన ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి.. ఏపీలో భారీ వర్షాలు

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

AP Weather: అల్పపీడనానికి తోడైన ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి.. ఏపీలో భారీ వర్షాలు
Weather Report
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 07, 2024 | 4:41 PM

కోస్తా జిల్లాలకు మరో రెండు, మూడు రోజుల వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి తోడైంది. దీంతో శనివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం విజయనగరం, గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలకు వర్ష సూచనలు ఇచ్చింది వాతావరణ శాఖ. ఆదివారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.  ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా, అల్లూరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉభయగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల భారీ అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం కోనసీమ, కాకినాడ, అనకాపల్లి,  విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతిపురం, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆరంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఆదివారం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని… మరో మూడు రోజులపాటు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

అల్పపీడనం క్రమంగా…

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఎల్లుండి నాటికి ఇది వాయుగుండంగా బలపడుతుంది. అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. అల్ప పీడనం కు అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం . జైసల్మేర్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతొంది అల్ప పీడనం. ఎల్లుండి నాటికి వాయువ్య బంగాళాఖాతం- పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండం గా మారే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా 3 రోజులలో ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!