AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ప్రజలకు చల్ల చల్లని కూల్ న్యూస్.. కారుమేఘాలు కమ్ముకొస్తున్నాయ్.. ఇక వర్షాలే.. వర్షాలు..

నల్లని మబ్బులు కనిపిస్తున్నాయి. అదిగో వర్షం అన్నట్లు మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే చినుకు జాడ మాత్రం కనిపించడం లేదు. వర్షాలు ఊరించి ఊరించి ఉసూరుమనిస్తున్నాయి. ఈసారి మంచి వర్షాలు ఉంటాయంటూ రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది వాతావరణ శాఖ. అయితే ఈ నెల మొదటి వారంలో కాస్త గట్టిగానే కురిసిన వర్షాలు, ఆ తర్వాత కనిపించడం మానేశాయి. వరుణ దేవుడు కనికరించకపోవడంతో మబ్బులు ముఖం చాటేశాయ్‌.

Rain Alert: ప్రజలకు చల్ల చల్లని కూల్ న్యూస్.. కారుమేఘాలు కమ్ముకొస్తున్నాయ్.. ఇక వర్షాలే.. వర్షాలు..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2024 | 6:56 PM

Share

నల్లని మబ్బులు కనిపిస్తున్నాయి. అదిగో వర్షం అన్నట్లు మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే చినుకు జాడ మాత్రం కనిపించడం లేదు. వర్షాలు ఊరించి ఊరించి ఉసూరుమనిస్తున్నాయి. ఈసారి మంచి వర్షాలు ఉంటాయంటూ రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది వాతావరణ శాఖ. అయితే ఈ నెల మొదటి వారంలో కాస్త గట్టిగానే కురిసిన వర్షాలు, ఆ తర్వాత కనిపించడం మానేశాయి. వరుణ దేవుడు కనికరించకపోవడంతో మబ్బులు ముఖం చాటేశాయ్‌. అయితే రానున్న రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తెలంగాణలో రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని, హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఏపీలోని తుఫాను హెచ్చరికల కేంద్రం మాత్రం గుడ్‌ న్యూస్‌ అందిస్తోంది. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, రాష్ట్రమంతటా వ్యాపించాయంటున్నారు నిపుణులు దాదాపు 10 రోజుల తర్వాత రుతు పవనాలు మళ్లీ చురుగ్గా ముందుకు వెళుతున్నాయంటున్నారు. విజయనగరం వరకు వచ్చి ఆగిపోయిన నైరుతి రుతుపవనాలు.. విదర్భ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి.

రుతుపవనాలు ఈసారి రెండు మూడు రోజుల ముందుగానే ప్రవేశించాయి. జూన్ 13వ తేదీ కల్లా ఏపీలో అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే పరిస్థితి వచ్చింది. కానీ నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత బలం పుంజుకోలేకపోయాయి. మందకొడిగా కదులుతున్నాయి. అరేబియా మహాసముద్రంలో రుతుపవన కరెంటు బలహీనంగా ఉండడంతో అవి కాస్త మందగించాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో.. చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. అయినప్పటికీ మరింత బలాన్ని పుంజుకోవాల్సి ఉంది. కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం నాడు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పలనాడు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ..

ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలును నాటిన రైతులు, వర్షాలు లేక ఉసూరుమంటున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు ఎండిపోవడంతో రెండోసారి విత్తడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పుడు వర్షాలు కురిస్తే విత్తనాలు మొలకెత్తుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విత్తనాలను కాపాడుకోవడానికి మరికొందరు రైతులు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తూ నానా తంటాలు పడుతున్నారు.

ఇక నిన్నటిదాకా అగ్నిగుండంగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ వాతావరణం కాస్త చల్లబడింది. వాన చినుకులు పలకరించడంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హర్యానా, గురుగ్రామ్‌ల్లోనూ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..