యువతిపై దారుణం.. అత్యాచారం, హత్య కేసులో సీఎం సీరియస్.. రంగంలోకి హోం మంత్రి..

బాపట్ల జిల్లా చీరాల మండలం ఇపురుపాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రైలు పట్టాల సమీపంలో బహిర్ భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని యువకులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. యువతి మృతి దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల డీఎస్పీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈపురుపాలెం సీతారాంపేటకు చెందిన పముజుల సుచరిత (21) అనే యువతిగా గుర్తించి వారి బంధువుల నుంచి వివరాలు సేకరించారు.

యువతిపై దారుణం.. అత్యాచారం, హత్య కేసులో సీఎం సీరియస్.. రంగంలోకి హోం మంత్రి..
Murder Case
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 21, 2024 | 6:05 PM

బాపట్ల జిల్లా చీరాల మండలం ఇపురుపాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రైలు పట్టాల సమీపంలో బహిర్ భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని యువకులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. యువతి మృతి దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల డీఎస్పీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈపురుపాలెం సీతారాంపేటకు చెందిన పముజుల సుచరిత (21) అనే యువతిగా గుర్తించి వారి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అత్యాచారం చేసి యువతిని హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ప్రథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు డిఎస్పి బేతపూడి ప్రసాద్ తెలిపారు.

అసలేం జరిగింది..

ఈరోజు తెల్లవారుజామున ఈపురుపాలెంకు చెందిన 21 సుచరిత బహిర్భూమికి వెళ్ళేందుకు 5గంటల 45 నిమిషాల సమయంలో హైస్కూలు వెనుకవైపున ఉన్న రైల్వేట్రాక్‌ దగ్గరకు వచ్చింది. ఎంత సేపటికీ సుచరిత ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆమెకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఓ యువతి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతురాలు ఉదయం బహిర్భూమికని బయటకు వచ్చిన సుచరితగా గుర్తించారు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి వివరాలు సేకరించారు. సుచరిత మృతదేహంపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చీరాల డీఎస్పీ తెలిపారు.

సీఎం సీరియస్‌.. హోంమంత్రి పరామర్శ..

ఈపురుపాలెంలో యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం పరంగా అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలిన హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు బాధితులను పరామర్శించేందుకు హోంమంత్రి అనిత ఈపురుపాలెం బయలుదేరారు. యువతి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే పట్టుకుని అరెస్ట్‌ చేయాలని పోలీసులను ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles