AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు.. ఏపీకి ఎల్లో అలెర్ట్.. తాజా వెదర్ రిపోర్ట్

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తరం వైపు వెళ్తోంది. ఇది క్రమంగా బలపడుతూ..

AP Rains: ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు.. ఏపీకి ఎల్లో అలెర్ట్.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Ravi Kiran
|

Updated on: Sep 07, 2024 | 9:21 AM

Share

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తరం వైపు వెళ్తోంది. ఇది క్రమంగా బలపడుతూ.. సోమవారం నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి చైనాలో బీభత్సం సృష్టిస్తున్న ‘యాగి’ తుఫాన్ కారణంగా ఈ అల్పపీడనం ఉత్తరం దిశగా కదులుతోందని చెప్పింది. దీంతో ఏపీలో కుండపోత వర్షాల ముప్పు తప్పిందని వాతావరణ నిపుణులు వివరించారు.

అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని.. శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఏపీకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు తెలంగాణకి భారీగా వర్ష సూచన కనిపిస్తోంది. రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం వేళ ఉత్తర, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంది. అటు హైదరాబాద్‌కి మోస్తరు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ప్రస్తుతం అల్పపీడనం భువనేశ్వర్‌కి దగ్గర‌లో ఉంది. దాని ప్రభావం ఉత్తర తెలంగాణపై కనిపిస్తోంది. తెలంగాణలో గాలి వేగం గంటకు మాగ్జిమం 15 కిలోమీటర్లుగా ఉంటుంది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ