AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా విస్తరిస్తున్నాయి నైరుతి రుతుపవనాలు. ఐదు రోజులపాటు ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈరోజు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.

AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Andhra Weather
Follow us

|

Updated on: Jun 07, 2024 | 12:56 PM

రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు రత్నగిరి, షోలాపూర్, మెదక్, భద్రాచలం, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతుంది. రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి, మహారాష్ట్రలోని మరికొన్ని భాగాలు (ముంబయితో సహా), తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లోని మిగిలిన భాగాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్ & దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతములోని మరిన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలలోకి వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.  ఇక ఉత్తర రాయలసీమ & పరిసర ప్రాంతాలపై గల సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల అవర్తనము ఇప్పుడు దక్షిణ తెలంగాణ & పొరుగు ప్రాంతం పై కొనసాగుతున్నది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్యగల గాలి కోత ఇప్పుడు దాదాపు 16°N వెంబడి నడుస్తుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

శుక్రవారం, శనివారం, ఆదివారం :-తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.  ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

శుక్రవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

శనివారం, ఆదివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

రాయలసీమ :-

—————-

శుక్రవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

శనివారం, ఆదివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్