AP Elections 2024: వెర్రే.. నో డౌట్! చంద్రబాబు గెలవాలని నాలుక కోసుకున్న అభిమాని
ఏపీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గెలవాలని ఓ వ్యక్తి ఏకంగా నాలుక కోసుకున్నాడు. పోలింగ్‌కు కొన్ని గంటల వ్యవధి ఉందనగా సదరు వ్యక్తి ఆ దారుణానికి పాలప్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బంజారాహిల్స్, మే 13: ఏపీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గెలవాలని ఓ వ్యక్తి ఏకంగా నాలుక కోసుకున్నాడు. పోలింగ్‌కు కొన్ని గంటల వ్యవధి ఉందనగా సదరు వ్యక్తి ఆ దారుణానికి పాలప్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్ హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించాడు. అనంతరం బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఏపీలో సీఎంగా చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవాని స్వామికి మొక్కుకున్నానని ఓ లేఖ కూడా రాసిపెట్టాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని మహేశ్‌ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మహేశ్ ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో మహేష్ చికిత్స పొందుతున్నాడు.
కాగా మహేశ్ రాసిన లేఖలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. గతంలో తాను ఏపీ కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావాలని మొక్కుకున్నానని అలాగే జరిగిందని, ఆ తర్వాత కూడా జగన్ గెలవాలని ఇదే విధంగా నాలుక కోసుకుని మొక్కుకున్నానని లేఖలో తెలిపాడు. ఈ క్రమంలో ఈసారి ఎలక్షన్లలో నారా చంద్రబాబు సీఎంగా గెలవాని మొక్కుకున్నానని, అందుకే శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయం వద్ద నాలుక కోసుకున్నానని లేఖలో పేర్కొన్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.