Bypoll Result: హుజురాబాద్, బద్వేల్‌లో మొదలైన బైఎలక్షన్ ఓట్ల లెక్కింపు.. తొలి రౌండ్ ఫలితం ఎప్పుడంటే..
Bypoll Result: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు..

Badvel And Huzurabad Result: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారిన హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. హుజురాబాద్ ఓట్ల లెక్కింపు కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీ దగ్గర టెన్షన్ కొనసాగుతోంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. EVMల లెక్కింపు కోసం రెండు హాల్స్‌లో, 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 EVMల్లో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి. ఉదయం 9.30 వరకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశాలున్నాయి.
ఇక బద్వేల్ విషయానికొస్తే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. కొన్ని చోట్ల 12 రౌండ్స్‌వరకూ వెళ్లే ఛాన్స్ ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ తెరుస్తారు. కౌటింగ్ సూపర్ వైజర్లు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో లెక్కింపు జరుగుతుంది. రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ప్లే చేస్తారు.
ఇదిలా ఉంటే బైపోల్ బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే YCP-బీజేపీ మధ్యే వార్ జరిగింది. వైసీపీ నుంచి డాక్టర్ దాసరి సుధ, బీజేపీ నుంచి పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ చేశారు. 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఈసారి 68.3 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 2019లో ఇది 77 శాతంగా ఉంది. విజయంపై మొదటి నుంచి ధీమాగా ఉన్న వైసీపీ మెజార్టీపైనే తమ ఫోకస్ అని ప్రకటించింది.
బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. కలసపాడు మండలంలో 25వేల 260 మంది ఓటర్లున్నారు. ఈసారి 17 వేల 748 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పోలింగ్ శాతం 70.26 శాతంగా ఉంది. ఇక పోరుమామిళ్ల 48 వేల 5 మంది ఓటర్లుండగా, ఈసారి 30 వేల 801 ఓట్లు పోలయ్యాయి. కాశినాయన మండలంలో 22 వేల 295 మంది ఓటర్లుండగా 16 వేల 254 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌శాతం 72.90గా ఉంది. బికోడూరు మండలంలో 15 వేల 69 ఓట్లు ఉండగా, 11 వేల 365 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌శాతం 75.41 శాతంగా ఉంది. బద్వేల్ మండలంలో 40 వేల 719 మంది ఓటర్లుండగా, 28 వేల 727 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 70.54. అట్లూరు మండలంలో 19 వేల 412 మంది ఓటర్లున్నారు. ఇందులో 14 వేల 701 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 75.73. గోపవరం మండలంలో 44 వేల 480 మంది ఓటర్లుండగా, 27 వేల 617 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 62.08.
Also Read: Samantha: కొన్నిసార్లు కలపడం కంటే.. అలా వదిలేయడమే ముఖ్యం. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన సమంత..
