తల్లి ఒడిలో సేదతీరాల్సిన చిన్నారి.. తండ్రి ఘాతుకానికి రోదన.. ఏం జరిగిందంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమకు, దాంపత్యానికి సాక్షిగా ముద్దుల చిన్నారి కూడా ఉంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు అంతలోనే కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పెద్దల పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్‎లు కూడా జరిగాయి. అంతా బాగానే ఉంది. ఇద్దరు హాయిగా ఉంటున్నారు అనుకుంటున్న సమయంలో అనుకోని దారుణం జరిగిపోయింది.

తల్లి ఒడిలో సేదతీరాల్సిన చిన్నారి.. తండ్రి ఘాతుకానికి రోదన.. ఏం జరిగిందంటే..
Anantapuram
Follow us
Nalluri Naresh

| Edited By: Srikar T

Updated on: Jul 16, 2024 | 9:07 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమకు, దాంపత్యానికి సాక్షిగా ముద్దుల చిన్నారి కూడా ఉంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు అంతలోనే కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పెద్దల పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్‎లు కూడా జరిగాయి. అంతా బాగానే ఉంది. ఇద్దరు హాయిగా ఉంటున్నారు అనుకుంటున్న సమయంలో అనుకోని దారుణం జరిగిపోయింది. కట్టుకున్న వాడే కాలయముడై.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. అనంతపురం జిల్లా పాత గుంతకల్లులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గుత్తి పట్టణానికి చెందిన పులికొండ (భర్త) గుంతకల్లుకు చెందిన సాయితేజ (భార్య) బంధువులు. సాయితేజను ఇష్టపడిన పులికొండ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం దాంపత్యం అన్యోన్యంగానే సాగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్ద మనుషులు పంచాయతీ చేశారు. పోలీస్ స్టేషన్లోనూ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత అంతా బాగానే ఉంది.

పులికొండ, భార్య సాయి తేజ మధ్య మళ్ళీ ఏమైందో తెలియదు కానీ సెల్ ఫోన్ చార్జింగ్ వైర్‎తో గొంతు బిగించి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు భర్త పులికొండ. హత్య అనంతరం చిన్నారిని తీసుకొని పారిపోతుండగా.. పీర్ల చావిడి దగ్గర ఉన్న యువకులు భర్త పులికొండను గమనించారు. రక్తపు మరకలతో చిన్నారిని తీసుకెళ్తుండటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నారు. చిన్నారిని వదిలేసి అక్కడి నుండి పులికొండ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని విచారించిన పోలీసులకు దారుణ విషయం బయటపడింది. పులికొండ ఇంటిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న సాయి తేజను పోలీసులు గుర్తించారు. హుటాహుటిన సాయి తేజను గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు కోసమే తన కూతుర్ని చంపేశాడని సాయి తేజ తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లి చనిపోవడం.. తండ్రి కటకటాల పాలవుతుండడంతో పాలు తాగే పసిపాప ఒంటరిగా మిగిలిపోయింది. తల్లి ఒడిలో ఉండాల్సిన చిన్నారిని ఎత్తుకొని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు