AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుంటూరు నగ్న పూజల వ్యవహారంలో సంచలనం.. వారే టార్గెట్‌గా ఆపరేషన్..!

గుంటూరు జిల్లాలో వుమెన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టయ్యింది. నగ్న పూజల వ్యవహారంలో తీగ లాగితే ట్రాఫికింగ్‌ కథ బయటపడింది. పూజల పేరుతో యువతుల్ని ట్రాప్‌ చేయడమే కాదు, ఆ తర్వాత లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు తేలింది. అసలు, ఈ నగ్న పూజలేంటి?. ఆ పనికి యువతులు ఎందుకు ఒప్పుకున్నారు?. ఈ బాగోతం ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం.

Andhra Pradesh: గుంటూరు నగ్న పూజల వ్యవహారంలో సంచలనం.. వారే టార్గెట్‌గా ఆపరేషన్..!
Black Magic
Shiva Prajapati
|

Updated on: May 14, 2023 | 9:48 PM

Share

గుంటూరు జిల్లాలో వుమెన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టయ్యింది. నగ్న పూజల వ్యవహారంలో తీగ లాగితే ట్రాఫికింగ్‌ కథ బయటపడింది. పూజల పేరుతో యువతుల్ని ట్రాప్‌ చేయడమే కాదు, ఆ తర్వాత లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు తేలింది. అసలు, ఈ నగ్న పూజలేంటి?. ఆ పనికి యువతులు ఎందుకు ఒప్పుకున్నారు?. ఈ బాగోతం ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం.

గుంటూరు జిల్లాలో నగ్న పూజలు కలకలం రేపాయ్‌. ముగ్గురు యువతులతో రెండ్రోజులపాటు నగ్న పూజలు చేయించింది ఓ ముఠా. మీ కష్టాలు తీరాలంటే అద్భుత శక్తుల్ని ఆవాహం చేసుకోవాలి, అందుకు నగ్న పూజలు ఒక్కటే మార్గమంటూ నమ్మించాడు ఫేక్‌ బాబా. అతని మాటల్ని నమ్మిన ఓ మహిళ.. ముగ్గురు యువతులను ట్రాప్‌చేసింది. నగ్నంగా పూజలో కూర్చొంటే చాలు 50వేలు ఇస్తామంటూ ఆశ చూపించింది. డబ్బుకు ఆశపడ్డ ఆ యువతుల్ని కర్నూలు నుంచి గుంటూరుకి రప్పించింది.

ఒకరోజు పొన్నెకల్లులో, ఇంకోరోజు చిలకలూరిపేటలో నగ్నపూజలు చేయించారు. అయితే, పూజల పేరుతో యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు ప్రయత్నించింది ముఠా. యువతులు ఎదురుతిరగడంతో గోరంట్ల తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారు. దాంతో, మోసపోయామని గ్రహించిన యువతులు దిశ యాప్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో నగ్నపూజల బాగోతం బయటపడింది.

ఇవి కూడా చదవండి

తీగ లాగితే డొంక కదిలినట్టుగా గుంటూరు నగ్న పూజల వ్యవహారంలో కొత్త కోణం బయటపడింది. పూజల పేరుతో యువతులను ట్రాప్‌చేసి వుమెన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. నిరుపేద యువతలే టార్గెట్‌గా ఈ ముఠా కార్యకలపాలు చేస్తోందన్నారు. జస్ట్‌, పూజలో కూర్చుంటే చాలు 50వేలు ఇస్తామంటూ ఆశచూపించి, ఆ తర్వాత లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు చెప్పారు. ముగ్గురు యువతులను ట్రాప్‌చేసిన ఈ ముఠా రెండ్రోజులుగా నగ్న పూజలు చేసిందని పోలీసులు వెల్లడించారు.

ప్రధాన నిందితురాలు అరవింద, దొంగ పూజారి మల్లెల నాగేశ్వర్రావుతోపాటు మొత్తం 12మందిని అరెస్ట్‌చేసి కటకటాల వెనక్కినెట్టారు పోలీసులు. ఇందులో ఇంకా చాలామంది ప్రమేయం ఉందని, వాళ్లందరినీ అరెస్ట్‌ చేస్తామన్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..