AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: జాలర్లు వేసిన వల బరువెక్కింది.. చిక్కింది చూడగా మైండ్ బ్లాంక్

బాపట్ల జిల్లాలోని మత్స్యకారులు చేపల కోసం వల వేస్తే.. ఆ వల బరువెక్కింది. ఇంతకీ అందులో ఏం చిక్కాయో తెలిస్తే.. దెబ్బకు అవాక్ అవుతారు. వారికి ఒక్కసారిగా పండుగే పండుగ.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ లుక్కేయండి.

AP News: జాలర్లు వేసిన వల బరువెక్కింది.. చిక్కింది చూడగా మైండ్ బ్లాంక్
Fishing
Fairoz Baig
| Edited By: |

Updated on: Jan 31, 2025 | 7:23 PM

Share

చేపలలో రాజు ఎవరయ్యా అంటే టూనా చేపలని టక్కున చెప్పేస్తారు. వాటి ప్రాధాన్యత అంతలా ఉంటుంది మరి.. ఈ చేపల్లో ఒమేగా 3, బి12 విటమిన్లు, ప్రొటీన్లతో పాటు అనే ఆరోగ్య ప్రయోజనాలు, గుణాలు ఉంటాయి. అందుకే వీటికి ప్రంపచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. శీతాకాలంలో పెద్ద సంఖ్యలో ఇవి లభిస్తుంటాయి. ఈ సీజన్‌లో సాధారణ వలలతో చేపలు, రొయ్యలు వేటాడేవారికి సైతం ఓ సైజు టూనాలు లభిస్తున్నాయి. వీటిని స్థానికంగా కొనేవారు చాలా తక్కువ. ఇతర రాష్ట్రాలతో పాటు పెద్ద సైజు టూనా చేపలు దొరికితే వాటిని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. వీటి ధర వేలల్లోనే ఉంటుంది. వీటికి ప్రత్యేకంగా మే 2వ తేదిన టూనా దినోత్సవం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఉత్సవాలు కూడా చేస్తారు.

టూనాను పోలిన కోణం చేప.. పండుగ చేసుకున్న మత్స్యకారులు..

బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఓ చిన్న సైజు టూనా చేప మత్స్యకారుడి వలకు చిక్కింది. యానాది అనే మత్యకారుడి వలకు ఈ అరుదైన చేప లభించింది. ఈ చేప ట్యూనా చేపను పోలిన మొహం, మిగిలిన భాగం నుంచి కోణం అనే పిలుచుకునే కింగ్ ఫిష్ ను పోలి ఉండటంతో మత్యకారులు ఆశ్చర్యానికి గురియ్యారు. ఈ చేప 15 కిలోల బరువు, నాలుగున్నర అడుగుల పొడవు ఉంది. ఈచేప ఫోటోలను ఇటు నిజాంపట్నం మొదలు అటు కేరళ వరకు చేపల వ్యాపారం చేసే విక్రయదారులకు స్థానిక మత్స్యకారులు పంపించారు. అయితే ఎవరూ దీన్ని ఇటు టూనా అని కానీ, అటు కింగ్‌ ఫిష్‌ అని కాని నిర్ధారణ చేయలేకపోయారు… ఈచేప ఈజాతికి చెందిందో తేల్చలేకపోయారని వాడరేవు కు చెందిన మత్యకారులు చెబుతున్నారు… చివరిగా ఈ చేప టూనా జాతికి చెందిన ఓ రకమైన చేపగా భావిస్తున్నారు. ఈ అరుదైన చేపను స్థానిక వ్యాపారి వంక అమోస్ 7 వేల రూపాయలకు కొనుగోలు చేసి కేరళ రాష్టానికి ఎగుమతి చేయడం విశేషం.

Fish

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!