Huge Money Siezed: ఆ బ్యాగ్ నిండా నోట్ల కట్టలే.. అది చూసి షాక్ అయిన అధికారులు.. ఇంతకీ ఎక్కడంటే..
Panchalingala Check Post: కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలను పటిష్టం చేశారు. దాంతో గత కొద్ది రోజులుగా..
Panchalingala Check Post: కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలను పటిష్టం చేశారు. దాంతో గత కొద్ది రోజులుగా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద భారీ స్థాయిలో నగదు, నగలు పట్టుబడుతున్నాయి. శనివారం నాడు కూడా కల్లుచెదిరే రీతిలో భారీ స్థాయిలో డబ్బు, బంగారం పట్టుబడింది. మూడు కోట్ల ఐద లక్షల నగదు సహా, రూ. 55 లక్షల విలువ చేసే బంగారం శనివారం ఒక్కరోజే పట్టుబడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకెళితే.. రోజూవారి తనఖీల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన చేతన్ ట్రావెల్ డ్రైవర్.. హైదరాబాద్ నుంచి ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు వెళ్తున్నాడు. అదే సమయంలో కర్నూలు పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. చేతన్ కుమార్‌నూ తనిఖీ చేయగా.. ఎటువంటి బిల్లు లేకుండానే రూ.3.05 కోట్ల నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక బ్యాగ్‌లో మొత్తం 35,000 ఐదు వందల నోట్లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. చేతన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న రామచంద్ర మెడికల్ కళాశాలకు చెందిన వారిదని తేలినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ పకీరప్ప వెల్లడించారు.
ఇదిలాఉంటే.. శనివారం నాడే మరో తనిఖీలో రూ. 55 లక్షల విలువ చేసే బంగారం పట్టుబడిందని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన పీఎంజే జువెల్లర్స్‌కు చెందిన వ్యక్తి నుంచి పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద భారీగా బంగారం ఆభరణాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడిన బంగారు ఆభరణాల విలువ రూ. 55 లక్షలు ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ బంగారు ఆభరణాలకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో వాటిని కూడా సీజ్ చేసుకున్నామన్నారు. కాగా, ఇప్పటి వరకు పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద రూ. 12 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పకీరప్ప వెల్లడించారు.
Also read: