Andhra Pradesh Govt: కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇక నుంచి నేరుగా సీఎం పర్యవేక్షణలోనే..

Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అఖిలభారత సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనలకు సంబంధించి..

Andhra Pradesh Govt: కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇక నుంచి నేరుగా సీఎం పర్యవేక్షణలోనే..
Andhra Pradesh Govt
Follow us

|

Updated on: Apr 10, 2021 | 10:11 PM

Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అఖిలభారత సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనలకు సంబంధించి జ‌గ‌న్ స‌ర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కేడర్‌లోని అఖిలభారత సర్వీసు అధికారుల వ్యక్తిగ‌త ప‌ని తీరును స‌మీక్షించే అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికలను ఇక నుంచి ముఖ్యమంత్రే స్వయంగా ప‌ర్యవేక్షించనున్నట్లు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ ఉత్తర్వుల్లో ఏం ఉందంటే.. అఖిలభారత సర్వీసు నిబంధనలు 2007 ప్రకారం అధికారుల పనితీరు, స్వభావం, ప్రవర్తన తదితర అంశాలను స‌మీక్షించే అధికారం ఇకమీదట ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. సబ్ కలెక్టర్ నుంచి సీఎస్ వరకు, ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు, సబ్ డీఎఫ్ఓ నుంచి పీసీసీఎఫ్ ఉప అటవీ అధికారి, ముఖ్య అటవీ సంరక్షణాధికారి వరకూ అందరి పనితీరు నివేదికలను ఆమోదించే అధికారం సీఎంకు ఉంటుందని తాజా జీవో స్పష్టం చేశారు. ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల్లోని వేర్వేరు హోదాలు, ర్యాంకులకు సంబంధించిన రిపోర్టింగ్ అధికారులు ఉన్నప్పటికీ పనితీరు నివేదికలను మాత్రం సీఎం మాత్రమే ఆమోదిస్తారని తాజా ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టంచేశారు.

అయితు, పౌర సేవలు మరింతగా ప్రజలకు చేరటం, పాలనాయంత్రాంగంపై నియంత్రణ లాంటి అంశాల్లో మెరుగైన ఫలితాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. అయితే, ఒక్క గవర్నర్ కార్యదర్శికి సంబందించిన పనితీరు నివేదికను మాత్రమే రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వులు.. సర్వీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, కేంద్ర సర్వీసుల వంటి అంశాల్లో అధికారులకు కీలకం కానున్నాయి. ఇదిలాఉంటే.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అఖిల భార‌త సర్వీస్ ఆధికారులు పూర్తిగా ప్రభుత్వ పెద్దల నియంత్రణలోకి వెళ్లినట్లైందని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Also read:

Covid Lockdown: కరోనా టెర్రర్‌ అదుపుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం.. కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి..

థియేటర్లో నిల్చున్న ‘వకీల్ సాబ్’ హీరోయిన్… కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. ‘మాటల్లేవ్’ అంటున్న నివేధా..

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్