AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections 2024: రాయలసీమలో పెరిగిన పోలింగ్ శాతం.. అనుకూల, ప్రతికూలతలపై జోరుగా చర్చ..

రాయలసీమలో ఓటింగ్‌ శాతం భారీగా పెరిగింది. గతంలో కంటే అధిక శాతం నమోదైంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు ఓటర్లు. ముఖ్యంగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. యువత కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించింది.

AP Elections 2024: రాయలసీమలో పెరిగిన పోలింగ్ శాతం.. అనుకూల, ప్రతికూలతలపై జోరుగా చర్చ..
Rayalaseema
Srikar T
|

Updated on: May 14, 2024 | 12:04 PM

Share

రాయలసీమలో ఓటింగ్‌ శాతం భారీగా పెరిగింది. గతంలో కంటే అధిక శాతం నమోదైంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు ఓటర్లు. ముఖ్యంగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. యువత కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించింది. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడపలో గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. అదే విధంగా కర్నూలు జిల్లాలోనూ పొలింగ్ శాతం అత్యధికంగా నమోదైనట్లు గత పోలింగ్ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. నంద్యాలలో గతంలో మాదిరిగానే పోలింగ్ శాతం నమోదైంది. ఇదిలా ఉంటే అనంతపురం, హిందూపురం, తిరుపతి, చిత్తూరులో పోలింగ్ శాతం గతం కన్నా కాస్త తగ్గిందని చెబుతున్నారు అధికారులు.

ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోటెత్తారు. గతం కన్నా ఒకశాతం ఎక్కువే పోలింగ్ నమోదైంది. రాయలసీమలోని అన్ని జిల్లాలతో పోలిస్తే అత్యధికంగా సత్యసాయి జిల్లాలో 82.77శాతం నమోదు అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 75.83 శాతం నమోదు అయినట్లు నిన్న ఈసీ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అదే కడప జిల్లాలో 78.72శాతం, నంద్యాల 80.92, అనంతపురం 79.25, తిరుపతి 76.5, చిత్తూరు 82.65శాతం నమోదు అయ్యాయి. మొత్తం రాయలసీమను ఓవర్ ఆల్‎గా పరిశీలిస్తే.. 79.53గా నమోదైంది. ఇది సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ మాత్రమే. ఇక అర్థ రాత్రి వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓటింగ్ శాతంపై ఈసీ ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దానిని కూడా కలిపితే దాదాపు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ పెరిగిన పోలింగ్ అధికార పార్టీ వైసీపీకి అనుకూలించే అంశంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు. గతంలో లాగానే ఈసారి కూడా మహిళలు అధికశాతం ఓటింగ్‎లో పాల్గొనడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం బాగా ఫలించిందని భావిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఉత్కంట నెలకొంది. తుది ఫలితాలు వెల్లడి కావాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం