AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Araku Valley: పర్యాటకులకు శుభవార్త.. ఎగిరిగంతేసే న్యూస్.!

ఆంధ్రా ఊటి అరకులోయలో పర్యాటకులు ఇక 'గాల్లో తేలినట్టుందే..' అనాల్సిందే..! ఎందుకంటే టూరిస్టులకు మరో అద్భుత అనుభూతినిచ్చే ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చేసింది. అదే.. హాట్ ఎయిర్ బెలూన్..! అంటే ఎమిటో మీరో చూడండి..

Araku Valley: పర్యాటకులకు శుభవార్త.. ఎగిరిగంతేసే న్యూస్.!
Araku Valley
Maqdood Husain Khaja
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 22, 2024 | 11:24 AM

Share

అరకు లోయలో హాట్ ఎయిర్ బెలూన్స్ అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో ఉండే హాట్ ఎయిర్ బేలున్స్.. ఇప్పుడు అరకులోయ సందర్శకుల కోసం సిద్ధమయ్యాయి. నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే విజయదశమినాడు సక్సెస్ ఫుల్‌గా ట్రైల్ రన్ పూర్తి చేసుకుంది. ఐటీడీఏపీఓ అభిషేక్ స్వయంగా పర్యవేక్షించారు. నిపుణుల సలహాలు సూచనలతో ప్రాజెక్టు ప్రారంభించినందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పద్మావతి గార్డెన్స్‌లో పర్యాటకులకు అందుబాటులో హాట్ ఎయిర్ బెలున్స్ ఉన్నాయి. అరకులోయ పర్యాటకులకు గాలిలో విహరించే ప్రత్యేక అనుభూతి ఇస్తుంది ఈ హాట్ ఎయిర్ బెలూన్.

శీతాకాలం వచ్చిందంటే.. అరకు ప్రకృతి అందాలు అమాంతంగా పెరిగిపోతాయి. సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఆ కొండలు లోయలు పొగ మధ్యలో గాల్లో వివరిస్తే ఆ అనుభూతే వేరు. అటువంటి అనుభూతిని కల్పిస్తోంది ఈ హార్ట్ ఎయిర్ బెలూన్. అరకు సందర్శించే పర్యాటకులు సుందరమైన లోయలు, పచ్చని కొండల మధ్య ఒక నిర్దిష్ట ఎత్తులో హాట్-ఎయిర్ బెలూన్ రైడ్‌ను అనుభూతి పొండవచ్చు. ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వం పర్యాటక ప్రదేశాలపై మరింత ఫోకస్ పెట్టింది. అరకు లోయకి ఏటా సుమారు మూడు లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. హాట్‌ బెలూన్‌.. సుమారు 300 అడుగుల మేర పర్యాటకులను పైకి తీసుకువెళ్లి మళ్లీ కిందకి దించుతుందని పీవో అభిషేక్ తెలిపారు. అందాల అరకులోయలో అడ్వెంచర్ టూరిజన్ని పరిచయం చేస్తున్నామని నిర్వాహకుడు సంతోష్ వెల్లడించాడు. గత పదిరోజులుగా హార్ట్ ఎయిర్ బెలూన్స్ ట్రైల్ రన్స్ నిర్వహిస్తూనే.. అన్ని భద్రతా ప్రమాణాలతో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. త్వరలో పారా మోటరింగ్ కూడా ప్రారంభిస్తామన్నారు.

వీడియో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..