AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Prdaesh: రూ.40 లక్షలు కొట్టేసినా గుర్తుపట్టలేదు.. కానీ, ఓ చిన్న పనితో అడ్డంగా బుక్కైంది.. మామూలు స్టోరీ కాదుగా..

ఆమె పేరు వెంకట రమణ.. నాలుగు నెలల క్రితం మిడ్ వ్యాలీ సిటీ అపార్ట్‌మెంట్‌లోని ఒక డాక్టర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. ప్రతిరోజూ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసి వెళ్లిపోయేది.. అయితే డాక్టర్లు తమకొచ్చిన నగదును ప్లాట్‌లో దాచిపేట్టేవారు. ఈ విషయం పనిమనిషికి తెలిసింది. అయితే ఎవరికి అనుమానం రాకుండా..

Andhra Prdaesh: రూ.40 లక్షలు కొట్టేసినా గుర్తుపట్టలేదు.. కానీ, ఓ చిన్న పనితో అడ్డంగా బుక్కైంది.. మామూలు స్టోరీ కాదుగా..
Crime News
T Nagaraju
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 22, 2024 | 12:23 PM

Share

అది 16వ నంబర్ జాతీయ రహదారికి సమీపంలోనే ఉన్న అపార్ట్‌మెంట్.. మంగళగిరి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతానికి ఖరీదైన అపార్ట్మెంట్ కూడా ఇదే.. విడ్ వ్యాలీ సిటీ.. ఇక్కడ డాక్టర్లు, ఐఏఎస్, ఐపిఎస్‌లతో పాటు బిజినెస్ పర్సన్స్ నివసిస్తుంటారు. అలాంటి అపార్ట్‌మెంట్ లో నమ్మకంగా పనికి చేరి అందిన కాడికి దోచేసిన ఓ పనిమనిషి ఆటకట్టించారు మంగళగిరి పోలీసులు.. దురాశ దు:ఖానికి చేటు అన్న సామెత మరోసారి ఈ పనిమనిషి విషయంలో రుజువైంది.

ఆమె పేరు వెంకట రమణ.. నాలుగు నెలల క్రితం మిడ్ వ్యాలీ సిటీ అపార్ట్‌మెంట్‌లోని ఒక డాక్టర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. ప్రతిరోజూ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసి వెళ్లిపోయేది.. అయితే డాక్టర్లు తమకొచ్చిన నగదును ప్లాట్‌లో దాచిపేట్టేవారు. ఈ విషయం పనిమనిషికి తెలిసింది. అయితే ఎవరికి అనుమానం రాకుండా అప్పుడు కొంత అప్పుడు కొంత డబ్బులు కొట్టేయడం చేస్తూ వచ్చింది. అయితే, డాక్టర్లు ప్రతి రోజు నగదు లెక్కించకపోవడం, దాచిన కట్టల్లో పెద్దగా తేడా లేకపోవటంతో వారికి అనుమానం రాలేదు. ఇలా గత కొంతకాలంగా వెంకటరమణ తన చేతి వాటం ప్రదరిస్తూ వచ్చింది. అయితే అనుమానం రాకపోవడంతో డాక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్దీ రోజుల తర్వాత ఇంట్లో విలువైన డైమండ్ నల్లపూసలు గొలుసు కనిపించకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యురాలు ఏం చేయాలో అర్ధంకాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.

ప్లాట్‌లోకి ఎవరెవరు వస్తున్నారో, వెళుతున్నారో సిసి కెమెరా విజువల్స్ ద్వారా పరిశీలించారు. అయితే వెంకట రమణ మాత్రమే రోజు వస్తూ పోతుండాటాన్ని గమనించారు.. దీంతో పోలీసులకు మొదట అనుమానం పనిమనిషి వెంకట రమణపైనే వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అన్ని విషయాలు చెప్పింది. గత నాలుగు నెలల్లో దాదాపు ముఫ్పై ఏడు లక్షల రూపాయల నగదు అపహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ డబ్బుతో 300 గ్రామాల బంగారు ఆభరణాలు, యమహా బైక్, ఖరీదైన ఐఫోన్, సామ్ సంగ్ ఫోన్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటితో పాటు పదకొండు లక్షల తొమ్మిది వేల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక వెంకటరమణకు సహకరించిన ఆమె బంధువు వెంకన్నను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్నిసార్లు నగదు తీసుకెళ్లినా గుర్తించకపోవడంతోనే వెంకట రమణ బంగారు ఆభరణాలపై కన్నేసినట్లు తేలింది. అయితే దురాశకు పోయి ఆమె చిక్కుల్లో పడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. అయితే పని మనుషులకు ఇంట్లో పనికి పెట్టుకునేటప్పుడు యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మంగళగిరి డిఎస్పీ మురళిక్రిష్ణ చెప్పారు. కేసును వెంటనే చేధించిన సిఐ శ్రీనివాసరావును, ఎస్సై వెంకట్ ను డిఎస్పీ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..