AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Actress Case: ముంబై నటి జిత్వాని కేసుపై స్పందించిన హోం మంత్రి.. ఏమన్నారో తెలుసా..?

ముంబై నటి ఎపిసోడ్.. ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. వారం రోజులుగా రకరకాల కథనాలు.. అనేక ఆరోపణలు.. ఏకంగా సీనియర్ ఐపీఎస్‌లనే టచ్ చేసింది. దీంతో ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

Mumbai Actress Case: ముంబై నటి జిత్వాని కేసుపై స్పందించిన హోం మంత్రి.. ఏమన్నారో తెలుసా..?
Vangalapudi Anitha
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 30, 2024 | 7:21 AM

Share

ముంబై నటి ఎపిసోడ్.. ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. వారం రోజులుగా రకరకాల కథనాలు.. అనేక ఆరోపణలు.. ఏకంగా సీనియర్ ఐపీఎస్‌లనే టచ్ చేసింది. దీంతో ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

ఈ కేసు విచారణకు విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌ని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయన్నారు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు. కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు. సీనియర్ ఐపీఎస్‌లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చించి.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సీపీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు.

నటి వ్యవహారంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. బాధితురాలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారని.. విచారణ కోసం మహిళా అధికారిని నియమించామని హోం మంత్రి వెల్లడించారు. పోలీసుల విచారణలో తప్పు చేసినట్టు తేలితే అధికారులతో సహా ఎవరి వదిలిపెట్టమన్నారు. పోస్టింగుల కోసం గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె అన్నారు. గత ప్రభుత్వంలో పోలీస్ విభాగాన్ని నిర్వీర్యం చేసి వారి సొంత పనులకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈ కేసులో ఎవరు ఉన్నా.. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. వేధింపులకు పాల్పడ్డారు అనేది ఆమె ఆరోపిస్తోందన్నారు. పోలీసులు.. ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనంగా పోలీస్ శాఖ ఉండాలని హోంమంత్రి అనిత అన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ విభాగాన్ని పూర్తిగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. దిశ పోలీస్ స్టేషన్లను పూర్తిస్థాయి మహిళా పోలీస్ స్టేషన్లుగా వినియోగిస్తామన్నారు హోం మంత్రి. దిశ అనేది అసలు చట్టమే లేదన్నారు.

అసలేం జరిగిదంటే..?

కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్‌.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ ముంబైకి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ కాదంబరీ జత్వానీతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నడిచాయి. సీన్ కట్ చేస్తే ప్రేమ పేరుతో తనను నటి మోసం చేసిందంటూ విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. తన దగ్గర కోటి రూపాయల వరకూ వసూలు చేసిందని ఆరోపించాడు విద్యాసాగర్.

ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్పెషల్ ఫ్లైట్‌లో ముంబై వెళ్లి మరీ ఆమెను అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీ తీసుకొచ్చారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. కొద్దిరోజుల తర్వాత బయటకు వచ్చిన ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంది. ఇప్పటికీ ఆ కేసు విచారణలోనే ఉంది. ఇదంతా కొన్ని నెలల క్రితం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మళ్ళీ ఈ కేసు తెరపైకి వచ్చింది.

ఈ కేసులో ఒకప్పుడు నిందితురాలిగా అరెస్టైన జత్వానీ.. తాను బాధితురాలిని అంటోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. తనతో పాటు తన కుటుంబసభ్యులను కూడా చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఆరోపిస్తోంది. ఓ గెస్ట్‌ హౌస్‌లో బంధించి వేధించారని.. బెదిరించి సంతకాలు పెట్టించుకుని ఆస్తులు రాయించుకున్నారని ఆరోపించారు జత్వాని. గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనేది ముంబై నటి ఆరోపణ. ముఖ్యంగా పలువురు ఐపీఎస్ అధికారులపై ఆమె ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

మరోవైపు ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసు వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే కొందరు అధికారులను కావాలనే టార్గెట్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కేసు అంతా ఓ డ్రామా అని కొట్టిపారేస్తోంది వైసీపీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..