AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamshabad-Vizag train route: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై 4 గంటల్లోనే శంషాబాద్ టూ విశాఖపట్నం.. రయ్‌మని దూసుకపోయే రూట్ ఇదే!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త..ఇక నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి చేరుకోవడానికి 12 గంటల సమయం అవసరం లేదు.. కేవలం 4 గంటల చాలు..విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 4 గంటల్లోనే.. కొత్త రైలు మార్గం, ఈ రూట్‌ వివరాలు ఇదిగో..

Shamshabad-Vizag train route: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై 4 గంటల్లోనే శంషాబాద్ టూ విశాఖపట్నం.. రయ్‌మని దూసుకపోయే రూట్ ఇదే!
Shamshabad Vizag Train Route
Velpula Bharath Rao
|

Updated on: Oct 26, 2024 | 7:28 AM

Share

శంషాబాద్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. ఇది సూర్యాపేట, విజయవాడ నుంచి వెళ్లనుంది. అలాగే కర్నూల్‌లో మరో కారిడార్ నిర్మించబోతున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైల్ విశాఖ నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు చేరుతుంది. దీని కోసం నిర్వహించిన పెట్‌( ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌) సర్వే చివరికి దశకు చేరింది. ఈ తుది దశకు చేరుకున్న సర్వే రిపోర్ట్‌ను నవంబరులో రైల్వే బోర్డుకు సమర్పించనన్నట్లు తెలుస్తుంది. సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో రెండు విమానాశ్రయాలు శంషాబాద్, రాజమహేంద్రవరం లకు అనుసంధానించేలా ఈ ఎలైన్‌మెంట్ ఏర్పాటు చేయడం మంచి విషయం. గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయితే కేవలం నాలుగు గంటల్లోపే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం 12 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం వందేభారత్‌లో 8.30 గంటల్లో చేరుకోవచ్చు

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది, రాష్ట్రాల మధ్య లక్షల మంది ప్రజలు పని కోసం ప్రయాణిస్తున్నారు. హై-స్పీడ్ రైలు కారిడార్ రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను అనుసంధానించడమే కాకుండా ప్రయాణ, వాణిజ్యం, వస్తువుల ఎగుమతి మరియు దిగుమతిని సులభతరం చేస్తుంది.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నారు. నల్గొండ మాజీ ఎంపీలు ఈ అంశాన్ని పదే పదే కేంద్రం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల అవసరాలను గుర్తించి రైలు కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాంతాల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నారు. హై-స్పీడ్ రైలు కారిడార్  ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ప్రయాణికులు తమ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వరకు 900 కిలోమీటర్ల ప్రయాణం కేవలం నాలుగున్నర గంటల లోపే తగ్గనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి