Heavy Rain Alert: బాబోయ్.. మళ్లీ భారీ వర్షాలు! వచ్చే 2 రోజులు టెన్షన్..టెన్షన్..
AP Weather Updates: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు వాతావరణ శాఖ శనివారం (నవంబర్ 15) ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఏర్పాడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని తన ప్రకటనలో వాతావరణ శాఖ పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో మారు వర్షాలు దంచికొట్టనున్నాయి..

అమరావతి, నవంబర్ 16: ఇప్పటికే తీవ్రచలితో ఇబ్బంది పడిపోతున్న జనాలకు వాతావరణ శాఖ మరో షాకింగ్ నూస్ చెప్పింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు వాతావరణ శాఖ శనివారం (నవంబర్ 15) ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఏర్పాడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని తన ప్రకటనలో వాతావరణ శాఖ పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో మారు వర్షాలు దంచికొట్టనున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వచ్చే రెండు రోజులు అంటే బుధవారం వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




