Andhra: చల్లటి కబురు వచ్చేసిందోచ్.. ఏపీకి వచ్చే 2 రోజుల్లో భారీ రెయిన్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ హీట్ పెంచుతుంటే.. వెదర్ కూల్‌గా ఉంది. తూర్పు విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వానలు కురుస్తున్నాయి. ఏ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో చూద్దాం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. విశాఖ నుంచి నెల్లూరు వరకు ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, జిల్లాల్లో అల్లూరి, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటాయి. ఆ వివరాలు.. మంగళవారం(10-06-25) విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది.
బుధవారం ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40- 41.5°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట,మన్యం జిల్లా గంగన్నదొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలెపాడులో 40.9°C నమోదైంది. అయితే జూన్ 11 నుంచి ఏపీవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..