Andhra Rains: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలోని పలు ప్రాంతాలకు వర్షసూచన
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రాగల మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు.. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. బుధవారం నాడు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రజలు, రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఏపీలో వానలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య ఉత్తరప్రదేశ్, పొరుగు ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్ & విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 & 4.5 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తీర ఒడిశా & దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
సోమవారం, మంగళవారం: – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. గరిష్టముగా 60 కి.మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
బుధవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. గరిష్టముగా 60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం, మంగళవారం: – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. గరిష్టముగా 60 కి.మీ వేగం తో వీచే అవకాశం ఉంది. కొన్నిచోట్ల వేడి , తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.
బుధవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. గరిష్టముగా 60 కి.మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
రాయలసీమ :-
సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
మంగళవారం : – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. గరిష్టముగా 60 కి.మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
బుధవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచాలా చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. గరిష్టముగా 60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..