Weather Alert: అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. రుతుపవనాల మందగమనంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. రుతుపవనాల మందగమనంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యప్రదేశ్ విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి ఏర్పడింది. దీంతో పాటు ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 4.5 కి మీ మధ్యలో మరొక ద్రోణి ఏర్పడిందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో వీస్తున్న పశ్చిమ – వాయువ్య దిశలో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది..
ఉష్ణోగ్రతలు: మంగళవారం గరిష్టంగా ఆదిలాబాద్ లలో 40.5, కనిష్టంగా మెదక్ లో 27.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీ వెదర్ రిపోర్ట్..
ఇదిలాఉంటే.. ఏపీలో అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. విజయనగరం,మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి గరిష్టంగా40- 41°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..